దొంగలను పట్టుకోండి…..రూ.1లక్ష పట్టుకుపోండి!

Thursday, July 5th, 2018, 07:00:53 PM IST

మనదేశంలో ప్రస్తుతం దోపిడీలు, దొంగతనాలు రోజు రోజుకూ మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మనిషి కేవలం ధనానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రాణానికి విలువ లేకుండా పోవడమే, మనిషిలోని పైశాచికత్వాన్ని బయటకు తీయడం ద్వారా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆధ్యాత్మిక వేత్తలు, మరియు మానసిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం సమాజం ధనం మూలం ఇదం జగత్ అనే చందాన తయారైందని, విలువలు, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలకు మనిషి తనకు తానే పాతర వేస్తున్నాడని అంటున్నారు. ఇక విషయంలోకి వెళితే, ఇటీవల రాజధాని నగరం హైదరాబాద్ బీరంగూడలో జరిగిన నగల షాప్ దోపిడీ నగర ప్రజలను తీవ్ర భయ కంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

కాగా దొంగతనానికి పాల్పడిన ముఠా, తప్పకుండ అంతర్రాష్ట్ర ముఠా నే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు వారికోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకులాటను మరింత వేగవంతం చేసారు. అయితే నగల దుకాణాన్ని ఇటీవల పరిశీలించిన క్లూస్ టీం, నిందితులు అక్కడ ముందుగానే రెక్కీ నిర్వహించి మరీ దొంగతనం చేసినట్లు చెపుతున్నారు. వారు ముందుగానే ఒక పధకం ప్రకారమే నగల షాపు యజమానిని బందించి షాపులో వున్న బీరువాలో నాలుగు లక్షల రూపాయల నగదు మరియు బంగారు ఆభరణాలతో ఉదయిచారని, కానీ వారెవరో ఎక్కువ కాలం డాగారని, అందుకే వారిని పట్టుకుంటే రూ.1లక్ష బహుమతి కింద అందచేస్తామని వారు ప్రకటించారు….

  •  
  •  
  •  
  •  

Comments