ట్రైలర్ టాక్ : అమ్మమ్మగారిల్లు – మనసుకు హత్తుకునేలా వుంది!

Thursday, May 24th, 2018, 09:45:31 AM IST

యంగ్ హీరో నాగ శౌర్య, షామిలి హీరో హీరోయిన్ లు గా సుందర్ సూర్య దర్శకత్వంలో నటిస్తున్న నూతన చిత్రం అమ్మమ్మగారిల్లు. ఇందులో నాగశౌర్య కు అమ్మమ్మగా సీనియర్ నటి సుమిత్ర గారు నటిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్, అలానే టీజర్ కు మంచి మార్కులే పడ్డాయి. కాగా నిన్న యూనిట్ చిత్ర ట్రైలర్ ను సామజిక మాధ్యమం యూట్యూబ్ లో విడుదల చేసింది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇదో ఒక కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతల మధ్య సాగె చిత్రంలా వుంది. అలానే చిత్రంలో అంతర్లీనంగా లవ్ ట్రాక్ కూడా ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా ట్రైలర్ లో అమ్మమ్మ, మనవడికి మధ్య వున్న బాంధవ్యయానికి సంబందించి వచ్చే డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. జీవితంలో కలిసిరావాలంటే కూతుర్ని కనాలి, అదే తెలిసిరావాలంటే కొడుకుని కనాలి అని రావు రమేష్ పలికే డైలాగు, ఒక్క సెకను ఫోటో కోసం నవ్వితే ఫోటో చాలా అందంగా వస్తుంది, మనకి ఉంది ఒక్కటే జీవితం మావయ్య, దాన్ని నవ్వుతూ గడిపేస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది అని హీరో పలికే డైలాగులు బాగున్నాయి. ఓయ్ చిత్రం తరువాత షామిలి ఈ చిత్రంతో మల్లి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. కల్యాణ రమణ సంగీతం, రసూల్ ఎల్లోర్ ఫోటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం స్వాజిత్ మూవీస్ పతాకంపై నిర్మితమవుతోంది. కాగా ఈనెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది…..

  •  
  •  
  •  
  •  

Comments