22 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు

Sunday, May 6th, 2018, 10:16:19 AM IST

కళ్లముందే చావు కనిపిస్తే ఆ క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాజస్థాన్ లో 22 మందికి అలాంటి అనుభవమే ఎదురైంది. కాలం కలిసి రావడంతో చావు నుంచి తప్పించుకున్నారు. వారి ప్రమాదానికి ఎదురుగా ఒక భారీ చెట్టు అడ్డుగా ఉండడంతో ప్రాణాలు దక్కాయి. సంచలనం సృష్టించిన ఈ ఘటన గోచర్ సమీపంలో జరిగింది. ప్రాణాలు దక్కించుకున్న వారందరు కాపాడిన చెట్టును చేతులెత్తి మెక్కారు.

అసలు వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ నుంచి బద్రీనాథ్ కు పయనమైన బస్సు మార్గం మధ్యలో ఎవరికి ఊహించని విధంగా ఒక ట్రక్కును ఢీకొట్టడంతో అదుపుతప్పి సమీపాన ఉన్న లోయ వైపుకు దూసుకెళ్లింది. దాదాపు 90 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడితే ప్రయాణికుల ప్రాణాలు మిగిలేవి కావు. అదృష్టవ శాత్తు లోయకు ముందు ఉన్న చెట్టును ఢీకొట్టడంతో స్వల్ప గాయాలతో అందరు తప్పించుకున్నారు. సురక్షితంగా బయటపడ్డ తరువాత బస్సులో ప్రయాణించిన వారందరు చెట్టువల్లే తాము ఈ రోజు ఊపిరి పిచుకుంటున్నామని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments