ట్రెండింగ్ : ‘మోటో’ ఫోన్లపై అమెజాన్ సంచలన ఆఫర్స్

Monday, April 9th, 2018, 10:19:41 PM IST

ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ధరలు ఆయా కంపెనీల మధ్య పోటీతో రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అదే ఏదైనా ప్రత్యేక పండుగ వచ్చినపుడు అయితే కంపెనీలు పలు ఆఫర్లతో ధరలను కొంతమేర తగ్గిస్తుంటాయి. అయితే ప్రస్తుతం మొబైల్ ఫోన్ అమ్మకాల్లో ఈ కామర్స్ సంస్థలు కొంత పై చేయిలో ఉన్నాయని చెప్పుకోవాలి. అందునా ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ అయితే ముందువరసలో వున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా బ్రహ్మాండమైన మోటో ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. మోటరోలా 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై ఈ భారీ ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.

అలాగే ఎక్స్‌‌చేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. ఏప్రిల్ 11 వరకు ఈ సేల్ కొనసాగనుంది. మోటో జీ5 మోడల్ అసలు ధర రూ.11,999 కాగా ఇప్పుడు దానిని రూ.8,420కే అందించనుంది. ఇందులోనే 32 జీబీ వేరియంట్‌పై రూ.4వేలు తగ్గించి రూ.9,999కే అందిస్తోంది. మోటో జీ5ప్లస్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గించింది. ఫలితంగా రూ.9,990కి తగ్గింది. మోటో జడ్2 ప్లే ధరను భారీస్థాయిలో రూ.7వేలు తగ్గించింది. దీని అసలు ధర రూ.27,999 కాగా, ఇప్పుడు రూ.20,999కి తగ్గింది. అలాగే ఎక్స్‌చేంజ్‌లో భాగంగా పాత హ్యాండ్‌సెట్‌లపై గరిష్టంగా రూ.12,398 అందించనుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ఆఫర్లతో మీరు కూడా మోటో ఫోన్లను సొంతం చేసుకోండి…..

  •  
  •  
  •  
  •  

Comments