ట్రెండింగ్ : హైదరాబాద్ లో డ్రోన్ కెమెరాల నిషేధం?

Wednesday, April 4th, 2018, 06:55:25 PM IST

ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో నేరాల అదుపు, అలానే సంఘవిద్రోహ చర్యలను అరికట్టేందుకు పోలీస్ లు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొన్ని సమస్యాత్మక, అలానే కొన్ని ప్రముఖ ప్రదేశాల్లో పోలీస్ లు వీటిని వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ డ్రోన్ కెమెరా ల వినియోగం ఒక నెలరోజులపాటు హైదరాబాద్ లో నిషేధించనున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర ఇంటెలిజెన్సు అధికారుల నుండి అందిన సమాచారం మేరకు ఈ సూచనలు చేశారట.

ప్రస్తుతం వీటి వినియోగం వల్ల ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని అందువల్ల ఈనెల 8 నుండి వచ్చే నెల 7 వరకు హైదరాబాద్ లో వీటిని నిషేదించనున్నారు. అయితే ఈ డ్రోన్ కెమెరాలను ఐటి కంపెనీలున్న ప్రాంతాల్లో మహిళల భద్రతకోసం వినియోగిస్తున్నారు. అయితే దీనివల్ల కొంతవరకు మహిళా ఉద్యోగులపై జరిగే దాడులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. ఈ విధంగా పోలీస్ శాఖకు అలానే ప్రజలకు మేలు చేస్తున్న ఈ డ్రోన్ కెమెరాలు ఈ నెలరోజులు పాటు పనిచేయవన్నమాట…..

  •  
  •  
  •  
  •  

Comments