ట్రెండింగ్ : మొబైల్ రంగంలో బిగ్గర్ బాటరీ తో “భారత్ 5 ప్రో” సెన్సేషన్

Thursday, March 15th, 2018, 11:45:09 PM IST

ఇప్పటికే భారతీయ మొబైల్ రంగంలో చైనా మొబైల్ మేకర్ షియోమీ తన వాటాను రోజు రోజుకూ పెంచుకుంటూ పోతోంది. మరోవైపు శాంసంగ్ సైతం ఎప్పటికప్పుడు న్యూ మోడల్ మొబైల్స్ రిలీజ్ చేస్తూ గట్టి పోటీ ఇస్తోంది. అలానే మోటోరోలా కూడా అద్భుత మోడల్స్ ను లాంచ్ చేయడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రస్తుతం తక్కువ ధరల్లో వినియోగదారుడికి అందుబాటులో వుండే మోడల్స్ మార్కెట్ లోకి ను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈ తరహా ఇతర దేశ కంపెనీల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ సరికొత్త ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చేసింది.

భారత్ రేంజ్‌ సక్సెస్‌తో ఊపుమీదున్న మైక్రోమ్యాక్స్ తాజాగా ‘భారత్ 5 ప్రొ’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 13 ఎంపీ రియర్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించడం విశేషం. 3జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ మరో ప్రత్యేకత. ధర రూ.7,999 మాత్రమే. పదివేల రూపాయల లోపు అన్ని ఫీచర్స్ కోరుకునే వారికి ఈ బడ్జెట్ ఓరియెంటెడ్ ఫోన్ చాలా సౌకర్యంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు….