ట్రెండింగ్ : కస్టమర్స్ కు షియోమీ బంపర్ ఆఫర్

Friday, March 16th, 2018, 10:41:44 PM IST

ప్రస్తుతం మన దేశంలో మొబైల్ కంపెనీ ల మధ్య ఆసక్తిర పోటీ జరుగుతోంది. మరీ ముఖ్యంగా
దేశీయ అలానే విదేశీ ఉత్పత్తిదార్లు ఒకరికి మించి మరొకరు కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ మార్కెట్ లోకి మొబైల్స్ విడుదల చేస్తున్నారు. అందులో ముఖ్యంగా
ప్రముఖ చైనా మొబైల్‌ కంపెనీ షియోమీ మరింత మంది వినియోగదారులను
ఆకట్టుకునేలా దూసుకుపోతోంది. నేడు ఆ కంపెనీ కొత్తగా కస్టమర్ల కోసం ‘ఎంఐ ఎక్స్ఛేంజ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ వద్ద ఉన్న పాత ఫోన్‌ను ఇచ్చేసి సులభంగా కొత్త ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రకటించింది.

దీని ప్రకారం షియోమీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ఎం.కామ్‌లో మీ పాత మొబైల్‌ మోడల్‌ తదితర వివరాలను నమోదు చేయడం ద్వారా కొత్త ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో తగ్గింపు పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్‌ పథకంలో భాగంగా ఎంఐ.కామ్‌ వెబ్‌సైట్‌లో ఇచ్చిన 15 బ్రాండ్స్‌ మొబైల్స్‌లో మీరు ఉపయోగిస్తున్న మొబైల్ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్‌ ఆ లిస్ట్‌లో లేకపోతే ఈ పథకం మీకు వర్తించదు. ఉంటే మీ మోడల్‌ను ఎంచుకుని ఆ మొబైల్ తాలూకు ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేయాలి. దీనితో పాటు మీ మొబైల్‌ స్క్రీన్‌పై ఎలాంటి పగుళ్లు లేవని, ఫోన్‌ ఎలాంటి డ్యామేజీ కాలేదని స్పష్టం చేయాల్సి ఉంటుంది. వివరాలు నమోదు అయ్యాక మీ పాత ఫోన్ కు ఎంత మొత్తం వస్తుందో చూపిస్తారు. రెండో స్టెప్‌లో మీకు ఓ కూపన్‌ కోడ్‌ వస్తుంది.

ఈ కూపన్‌ కోడ్‌ డబ్బులు మీ ఎంఐ అకౌంట్‌లో జమ అవుతాయి. ‌మీరు ఎంఐ.కామ్‌ ద్వారా మొబైల్‌ కొనేప్పుడు ఈ కూపన్‌కోడ్‌ను వినియోగిస్తే మీ కొత్త ఫోన్‌లో మీ ఎంఐ అకౌంట్ లో వున్న డబ్బు మేరకు తగ్గింపు లభిస్తుంది. చివరిగా మీ ఆర్డర్‌ని ప్లేస్‌ చేశాక, మీ కొత్త ఫోన్‌ డెలివరీ సమయంలో ఎంఐ ఎగ్జిక్యూటివ్‌ మీ పాత ఫోన్‌ను తీసుకుంటారు. అయితే ఈ ఎక్స్ఛేంజ్‌ పథకంలో ఒక్క ఫోన్‌ మాత్రమే ఇవ్వడానికి ఉంటుంది.

ఇక కొత్త ఫోన్‌ బుక్ చేసాక, దానిని అందిచాల్సిన చిరునామా, పాత ఫోన్‌ తీసుకోవాల్సిన చిరునామా ఒకటే వుండాలితప్ప వేర్వేరుగా ఉండకూడదు. అలానే ఒకసారి మీరు పాత ఫోన్‌ ఇచ్చేశాక అది ఎట్టిపరిస్థితిల్లోనూ తిరిగి ఇవ్వడం కుదరదు. బాగుంది కాదు ఆఫర్. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పాతపడిన ఫోన్ ఉంటే ఇప్పుడే దాన్ని ఎంఐ సైట్ లో చెక్ చేసి ఎంత వస్తుందో చూసుకుని కొత్త ఎంఐ ఫోన్ ఈ పండుగవేళ మీ ఇంటికి తెచ్చుకోండి….

  •  
  •  
  •  
  •  

Comments