ట్రెండింగ్ – ధోని పై యువరాజ్ ఆసక్తికర వాఖ్యలు…

Saturday, February 9th, 2019, 10:53:16 AM IST

మన డాషింగ్ క్రికెటర్ యువరాజ్, మాజీ కెప్టెన్ ధోని పైన కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశారు. రానున్న ప్రపంచకప్ ఆటలో మన భారత జట్టుకు ధోని చాలా అవసరమని యువరాజ్ చెప్పుకొచ్చారు. ధోని ఆట తీరు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాగే చాలా కీలకమైన పరిస్థితుల్లో కూడా ఆటను ఎలా తిప్పగలడో, దాంట్లో ధోనికి ఎంత అనుభవం ఉందొ కూడా మనందరికీ తెలుసు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని అనుభవం జట్టులో యువ క్రికెటర్లకు తోడు కెప్టెన్ కోహ్లీకి బాగా ఉపయోగపడుతుందని యువరాజ్ అంటున్నారు.

ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్, ధోనిని ఆకాశానికి ఎత్తేశాడు. ధోని అవగాహన, అతని ఖశ్చితత్వం జట్టుకు ఎంతో అవసరమని, అత్యద్భుతమైన క్రికెట్ మేధస్సు ధోనీకే సొంతం అని యువరాజ్ కొనియాడారు… గత కొన్నేండ్లుగా కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ధోని తన ప్రతిభను చూపిస్తున్నాడు. ఇకపోతే నాయకుడిగా కూడా ధోని ఇప్పటికే నిరూపించుకున్నాడు. కీలక సమయాల్లో అతని సలహాలు, సూచనలు యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్ కోహ్లీకి బాగా ఉపయోగపడుతాయని యువరాజ్ అన్నారు.