భయపెడుతున్న ఏనుగులు..!కునుకు తీయని గిరిజనులు!

Friday, September 7th, 2018, 12:40:24 PM IST

ప్రశాంతతకు, నెమ్మది తనానికి ప్రతీకగా మనము ఏనుగుని సూచించవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఏనుగులను చూస్తేనే అడవి పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అడవిలో ఉండాల్సిన గజరాజులు జనసంచారం లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్లినట్టయితే శ్రీకాకుళం జిల్లా సీతాం పేట ప్రజలు ఇప్పుడు వీటి సమస్య ఎదుర్కుంటున్నారు.

కొన్ని రోజుల క్రితం రెండు పిల్ల ఏనుగులతో ఒక తల్లి ఏనుగు అడవుల్లోనుంచి బయటకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత పాత పట్నం లోని హల్తి ప్రాంతం లో మరికొన్ని ఏనుగు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు కనుక్కొని పోలీసుల సాయంతో దాదాపు 60 రోజులు శ్రమించి వాటిని వేరే చోటకి తరలించగా అవి మళ్ళీ తిరిగి వచ్చేసాయి. అన్ని వనరులు పుష్కలంగా లభించడం తో జనావాసం లోకి వచ్చేసాయి. గిరిజన ప్రాంతం కావడం వలన అక్కడి ప్రజలు పండించుకునే అరటి తోటలు, మొక్క జొన్న, చెరుకు పంటల మీద పడి తినేసి ఆ పంటల్లోనే అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాయి అని వారి పంట పొలాల్లోకి వెళ్లంటేనే భయంగా ఉంటుందని, వాటి నుంచి వారికి రక్షణ కల్పించాలి అని, అంతే కాకుండా వాటిని శాశ్వతంగా తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని అక్కడి రైతులు తెలియజేసారు.

  •  
  •  
  •  
  •  

Comments