పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్స్: అతన్ని మాత్రం పెళ్లి చేసుకోను..!

Tuesday, February 12th, 2019, 02:05:34 PM IST

టాలీవుడ్ లో ముప్పైయేళ్లు దాటినా పెళ్లి చేసుకోని ముదురు భామలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు, అలాంటివారిలో ఒకరైన త్రిష ఇటీవల పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విలేఖరి అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానం ఇచ్చారు.నిజానికి ఈపాటికే త్రిషకి పెళ్లి జరగాల్సివుంది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ప్రేమలో పడి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి అనగా, ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుంది. ఆ తరువాత మళ్లీ సినిమాలతో బిజీ అయిపొయింది. “96” సినిమాతో పెద్ద హిట్ ని దక్కించుకుంది. రజినీకాంత్ “పేటా” సినిమాలో కూడా నటించింది.

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలంటూ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఏ టాపిక్ అయినా సూటిగా మాట్లాడేలా ఉండాలని, అందానికి ప్రాధాన్యత ఇవ్వనని, తనని బాగా చూసుకునే వాడైతే చాలని చెప్పుకొచ్చింది. కలర్ తో పెద్దగా సంబంధం లేదని, తనకు కాబోయే వాడు నల్లగా ఉన్నా పర్వాలేదని చెప్పింది.అమ్మ నాన్నలు చూపించిన వాడిని మాత్రం చచ్చినా చేసుకోనని, తప్పకుండ ప్రేమ వివాహమే చేసుకుంటానని తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చుస్తే త్రిష ప్రేమలో ఉందని గతంలో వచ్చిన రూమర్స్ నిజమేనేమో అనిపిస్తుంది.