మరోసారి హిలేరియస్ కాంబోలో వెంకీ మామ..!

Thursday, January 10th, 2019, 03:00:59 PM IST

వెంకటేష్ హీరోగా నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలందించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలలో కామెడీ ఎంతగా వర్కౌట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటేష్ కామెడీ టైమింగ్, మ్యానరిజమ్స్ కి తిఱివిక్రం మార్క్ డైలాగులకు బాగా సెట్ అవటంతో ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఆ తర్వాత వెంకటేష్ సోలో హీరోగా సినిమాలు చేయటం తగ్గించేసాడు, త్రివిక్రమ్ కూడా డైరెక్టర్ గా మారారు, అప్పటి నుండి త్రివిక్రమ్ స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు, మధ్యలో నితిన్ తో ఒక సినిమా చేసినప్పటికీ తర్వాత మళ్లీ స్టార్ హీరోలతోనే సినిమా చేసాడు. కాగా, ఈ మధ్య త్రివిక్రమ్ తన రూట్ మార్చినట్టు ఉన్నాడు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వెంకీ త్రివిక్రమ్ కాంబోలో సినిమాకు సన్నాహాలుజరుగుతున్నాయి.

ఈ మేరకు ఎఫ్2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్యల కాంబినేషన్ లో వెంకీ మామ సినిమా ప్రారంభం కానుంది, ఈ సినిమాతో పాటుగా త్రివిక్రమ్ తో సినిమా కూడా ఉండబోతోంది అంటూ ప్రకటించాడు వెంకీ. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో సినిమాకు కమిట్ అయ్యాడు, తాజాగా చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఉండబోతోందంటూ ప్రకటించారు, అయితే సైరా తర్వాత కొరటాల సినిమా లైన్లో పెట్టాడు చిరంజీవి, ఈ గ్యాప్ లో బన్నీ సినిమా, తర్వాత వెంకటేష్ సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్. మరీ ముచ్చటగా మూడోసారి రిపీట్ అవ్వబోతున్న ఈ హిలేరియస్ కాంబో ఎలా ఉండబోతోందో చూడాలి.