ఎన్టీఆర్ మూవీ కోసం అతని సాయం తీసుకుంటున్న త్రివిక్రమ్ ?

Tuesday, May 29th, 2018, 08:54:42 PM IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి చిత్రం అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అయితే చిత్ర పరాజయంతో త్రివిక్రమ్ కు కోలుకోలేని పెద్ద దెబ్బ పడింది. నిజానికి ఆయనకు కెరీర్ పరంగా ఢోకా లేనప్పటికీ ఆయన అభిమానులు మాత్రం చాలా ఢీలా పడ్డారు. ఇక తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెట్ చేసిన త్రివిక్రమ్, ఆ చిత్రానికి మొన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘అరవింద సమేత’ గా టైటిల్ నిర్ణయించారు. కాగా ఇటీవల విడుదలయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు అటు ఎన్టీఆర్ ఫాన్స్ నుండి, ఇటు త్రివిక్రమ్ ఫాలోయర్స్ నుండి అద్భుత స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని అయన ఎంతో శ్రద్ధతో పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారని, పక్కా కమర్షియల్ అండ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వుండనుందట ఈ చిత్రం.

అంతే కాదు ఈ చిత్రంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ ను వాడుతున్నారట. కోబలి చిత్రంకోసం చేసిన పరిశోధన కొంతవరకు అరవింద సమేతకు ఉపయోగపడుతోందట. కాగా ఈ బ్యాక్ డ్రాప్ లో హీరో సహా దాదాపుగా అందరూ రాయలసీమ యాసలో డైలాగులను పలకాల్సి ఉంటుందని, అందువల్ల ఇటీవల విడుదలయిన కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని దారి చూడు, దుమ్ము చూడు మామ పాట పాడిన పెంచల్ దాస్ సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు త్రివిక్రమ్. నిజానికి తన చిత్రానికి కథ, రచన, మాటలు తదితరాలన్నీ తానై చూసుకునే త్రివిక్రమ్ మొదటి సరి పెంచల్ దాస్ సహాయం తీసుకోవడం చిత్రానికి మరింత హెల్ప్ అవుతుందని అంటున్నారు. అంతే కాదు పెంచల్ దాస్ ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కు డైలాగుల విషయమై ప్రత్యేకంగా ఒక ట్యూటర్ గా వ్యవహరిస్తున్నట్లు చెపుతున్నారు. కాగా హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments