“కాఫీ విత్ కరణ్” ఎఫెక్ట్: పాండ్యాను దారుణంగా ట్రోల్ చేసిన యువతి..!

Sunday, February 10th, 2019, 09:00:01 PM IST

ఒక్కోసారి నోటి దూలతో మాట్లాడిన మాటల తాలూకు ప్రభావం మనల్ని జీవితాంతం వెంటాడే ప్రమాదం ఉంటుంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురయ్యింది, కొన్ని రోజుల కిందట కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సందర్భంలో అత్యుత్సాహంతో నోటిదూలతో చేసిన వ్యాఖ్యల కారణంగా న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఓ యువతి పాండ్యాను దారుణంగా ట్రోల్ చేసింది. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చిన సమయంలో అతన్ని గేలి చేస్తూ ఓ యువతి చేసిన ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. “కాఫీ విత్ కరణ్” షో తాను సెక్స్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో “ఆజ్ కర్ కే ఆయా” (ఈరోజు చేసి వచ్చా) అని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేంత స్వేచ్ఛ ఉందని చెప్పాడు పాండ్యా. అప్పట్లో ఈ కామెంట్స్ పై పెద్ద దుఆరం రేగింది, పాండ్యా ఆ వ్యాఖ్యలపై వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఓ మహిళా అభిమాని, “పాండ్యా ఆజ్ కర్ కే ఆయా క్యా” (ఈరోజు చేసి వచ్చావా?) అని ఫ్లకార్డులో ప్రదర్శించింది. అంతే ఆ యువతి అలా ప్లకార్డు చూపుతూ చేసిన ట్రోలింగ్ టీవీల్లో ప్రత్యేక్షం కావడంతో మనోడిని మరోసారి ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్లు. మూడో టీ20 మ్యాచ్‌లో కూడా పాండ్యాకు ఇలాంటి ట్రోలింగ్‌ ఎదురైంది. హార్దిక్ సిక్స్ కొట్టి సమయంలో ‘సెక్సీ సిక్స్’ అంటూ ఫ్లకార్డు ప్రదర్శించారు స్టేడియంలో అభిమానులు. మొత్తానికి ఈ రేంజ్ లో ట్రోలింగ్ కు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు.