నన్ను ఎదుర్కొనే దమ్ము,ధైర్యం లేకే నందమూరి సుహాసినిని దింపారు..!

Sunday, November 18th, 2018, 10:19:53 PM IST

తెలంగాణా ఎన్నికలలో రోజుకొక కొత్త అంశం చర్చనీయాంశం అవుతుంది.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసురాలు నందమూరి సుహాసిని గారు తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో టీటీడీపీ తరపు నుంచి కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్నట్టుగా నామినేషన్ కూడా వేశారు.అయితే ఆవిడకు రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటి సారి కావడంతో తెలంగాణా రాష్ట్రంలో అందరి దృష్టి కూకట్ పల్లి నియోజకవర్గం మీద పడింది.నందమూరి కుటుంబం నుంచి రావడంతో టీటీడీపీకి అక్కడ విజయం తధ్యం అని వారు భావిస్తున్నారు.అయితే అక్కడ తెరాస పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మాధవరాం కృష్ణారావు మాత్రం ఇప్పుడు అక్కడి టీటీడీపీ నేతల మీద మరియు చంద్రబాబు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎమ్మెల్యేగా కూకట్ పల్లి నియోజిక వర్గానికి ఎన్నో మంచి పనులు చేశానని,వచ్చే ఎన్నికల్లో తనని తన ప్రజలే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.అదే సందర్భంలో మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజికవర్గం నుంచి నేను నందమూరి సుహాసినిని ఎదుర్కోవడం కాదని,నన్ను ఎదుర్కునే దమ్ము,ధైర్యం వాళ్లకి లేకనే నందమూరి కుటుంబం నుంచి సుహాసిని గారిని నాకు ప్రత్యర్థిగా నిలబెట్టారని కృష్ణరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ టీటీడీపీ కి అంత బలమే ఉంటే ఇక్కడ అభ్యర్థినే నిలబెట్టొచ్చు కదా అది మానేసి పాపం అమాయకురాలిని తీసుకొచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టారని వ్యాఖ్యానించారు.వారు అలా ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.