పచ్చ నోట్లను నమ్ముకున్న గులాబీ నేతలు !

Tuesday, October 9th, 2018, 04:24:36 PM IST

ఎన్నికల ప్రచారం ఆరంభమయిందో లేదో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇన్నాళ్లు దాచుకున్న నోట్ల కట్టల్ని బయటకు తీస్తున్నారు. చేసిన వాగ్దానాల్లో సగం కూడ నెరవేర్చని వీరంతా గెలుపు కోసం ఉద్యమం కోసం పోరాడామనే సెంటిమెంట్ తో పాటు పచ్చ నోట్లని కూడ వాడుతున్నారు. మళ్ళీ గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూనే విచ్చలవిడిగా డబ్బులు పంపకం మొదలుపెట్టారు.

జగిత్యాల టిఆర్ఎస్ అభ్యర్థి ఎస్.సంజయ్ కుమార్ ప్రచారంలో భాగంగా మహిళా ఓటర్లకు 200 రూపాయల నోట్లను ఇస్తున్న స్రుస్యాలు మీడియాకు చిక్కాయి. వీటిపై కథనాల ప్రసారం మొదలైనా ఇంకా సంజయ్ కుమార్ వివరం ఇవ్వకపోవడం గమనార్హం. ఓటు నోటు కేసును పట్టుకుని చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న కేసిఆర్ మరి తమ అభ్యర్థులు చేస్తున్న ఈ
నోట్ల పంపకాని ఏవిధంగా సమర్థిస్తారో మరి.

ఎంతో జాగ్రత్తగా జరుగుతున్న ఈ నోట్ల పంపకంలో బయటికొచ్చింది ఈ ఒక ఉదంతమే అయినా చాలా నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండ ఈ ప్రలోభాలు జరుగిపోతున్నట్టు తెలుస్తోంది.