చేత కాని కాంగ్రెస్ దద్దమ్మలు కూడా మాట్లాడుతున్నారు…!

Tuesday, September 11th, 2018, 02:16:33 PM IST

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన లీడర్ కొప్పుల ఈశ్వర్ గారు ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీటింగులో ముందస్తు ఎన్నికల నిమిత్తం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నేతల యొక్క పని తీరును, వారు ప్రజలను మభ్య పెట్టె విధంగా మాట్లాడుతున్నారని, అసలు సాధ్యం కానీ దొంగ హామీలను ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారు పెట్టిన మేనిఫెస్టో ని చూసినట్లయితే చాలా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

పెన్షన్లను ఎక్కువ చేస్తాము, రెండేసి లక్షలు ఉన్న రుణాలను మాఫీ చేస్తాము అని, భూటకపు మాటలు మాట్లాడుతున్నారని, దాదాపు 50 ఏళ్లగా దద్దమ్మల్లా అధికారంలో ఉన్న మీరు ఇప్పుడు అధికారం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్న సంగతి ప్రజలకు తెలుసనీ పేర్కొన్నారు. ఈ మూడు ఏళ్లలోనే మీ నలభై యాభై ఏళ్ల అభివృద్ధి కనపడుతుంటే, మీకు విశ్వసనీయత ఎక్కడ ఉంది? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకు ఒక సరైన పద్ధతి లేదని ఎవరేం మాట్లాడుతారో వాళ్లకే తెలీదని, తెలంగాణా రాష్ట్రాన్ని సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మాకంటూ ఒక లక్ష్యం ఉంది అని అలా మీకు ఏ లక్ష్యం ఉంది అని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments