రేవంత్ రెడ్డి పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..!

Sunday, November 18th, 2018, 11:53:00 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకున్నందున అక్కడి ప్రతీ పార్టీ యొక్క ముఖ్య నేతలు వారి పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.అదే సమయంలో ఒకరి మీద మరొకరు విమర్శలు సద్విమర్శలు చేసుకుంటున్నారు.నిన్న టీకాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డి కెసిఆర్ మీద మరియు కేటీఆర్ మీద కొన్ని ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి పై తెరాస నేత అయినటువంటి హరీష్ రావు మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.రేవంత్ రెడ్డి అసలు అతని నియోజకవర్గం కొడంగల్ కు ఏం చేసాడని ప్రశ్నించారు.

అంతే కాకుండా అసలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోని కొండంగల్ నియోజకవర్గాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అని వ్యాఖ్యానించారు.అసలు కొడంగల్ నే ఏ మాత్రం అభివృద్ధి చెయ్యనటువంటి రేవంత్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు.కొడంగల్ కు రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్లి ఉండడని కానీ నేను వెళ్లానని తెలిపారు.అక్కడ ఎక్కడ చూసినా రోడ్లు బాగుండవనీ,కరెంటు అయితే అసలు ఉండదని,తాగునీరు కూడా ఉండదని మరి అక్కడ ఉద్ధరించలేని వాడు ఇక్కడకొచ్చి ఉద్ధరిస్తాడంట అని సంచలన వ్యాఖ్యలు చేశారు.