ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోడం ఖాయం..తెరాస జెండా ఎగరేయడం ఖాయం.!

Friday, November 16th, 2018, 01:42:14 PM IST

తెలంగాణలోని టీకాంగ్రెస్ మరియు టీటీడీపీ వంటి పార్టీలు అన్ని కలిసి ఒక కూటమిలా ఏర్పడి తెరాస ను ఎలా అయినా ఓడించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే..కానీ తెరాస కు ముఖ్యంగా గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీకాంగ్రెస్ పార్టీయే అని చెప్పాలి.ఇప్పటికే ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యి ఉన్నారు.అయితే తెరాస పార్టీకి చెందిన నేత సైది రెడ్డి మాత్రం ఈ రోజు టీకాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీరు పెట్టుకున్నటువంటి కూటమి వారిలో వారే తిట్టుకోవడానికి పెట్టుకున్నదే కానీ గెలవడానికి పెట్టుకోలేదు అని విమర్శించారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి అతని యొక్క నియోజికవర్గానికి అతి తక్కువ సార్లు వెళ్లిన ఎమ్మెల్యే ఎవరన్న ఉన్నారు అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డే అని మండిపడ్డారు.ఎమ్మెల్యేగా ఉత్తమ్ అతై నియోజకవర్గానికి ఏమి చేశారని ఎన్ని కాంట్రాక్టులు తెప్పించారని,అవి ఎవరికీ ఇప్పించారని ప్రశ్నించారు.వీరు ఏం చేసినా సరే ఓడిపోవడం ఖాయం అని తెలంగాణలో మళ్ళీ తెరాస జెండా ఎగరడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.