2014 నుండి 2018 వ‌రుక భారీగా పెరిగిన టీఆర్ఎస్ నేత‌ల ఆస్తులు..!

Wednesday, November 21st, 2018, 01:11:57 PM IST

2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థుల ఆస్తులు వివరాలు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాజ‌కీయ నేతలు ప్ర‌కటించిన ఆస్తుల వివ‌రాలు ఒక‌సారి గ‌మ‌నిస్తే వారి ఆదాయాల్లో భారీ పెరుగుద‌ల క‌నిపిస్తోంది. ఆ వివ‌రాలేంటో ఒక‌సారి మ‌నం కూడా ప‌రిశీలిద్దాం.

 కేసీఆర్

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆస్తులు గ‌త ఎన్నిక‌ల నాటికి 15.27లక్షల ఆదాయం ఉండగా.. ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. నాలుగేళ్లలో ఆయ‌న ఆదాయం 2.07 కోట్లకు చేరుకుని.. 1256 శాతం పెరిగింది. ఇక ఆయ‌న ఆస్తులు 2014 నాటికి 15.15 ఓట్లు ఉండ‌గా.. 2018 నాటికి 23.55కోట్ల‌కు చేరుకుంది.

కేటీఆర్

2014లో కేటీఆర్ ఆదాయం 51.09 ఉండ‌గా.. 2018 నాటికి 5.33బ‌కోట్లకు చేరుకుని ఆయ‌న ఆదాయం 944 శాతం పెరిగింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 7.98కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 41.82 కోట్ల‌తో 423 శాతం ఆస్తులు పెరిగాయి.

హ‌రీశ్‌రావు

2014లో హ‌రీశ్‌రావు ఆదాయం 24.38 ల‌క్ష‌లు ఉండ‌గా.. 2018 నాటికి 61.10 కోట్లకు చేరుకుని ఆయ‌న ఆదాయం 146 శాతం పెరిగింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 2.96 కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 11.44 కోట్ల‌తో 285 శాతం ఆస్తులు పెరిగాయి.

జ‌గ‌దీశ్‌రెడ్డి

2014లో జ‌గ‌దీశ్‌రెడ్డి ఆదాయం 24.38 ఉండ‌గా.. 2018 నాటికి 60.10 కోట్లకు చేరుకుని ఆయ‌న ఆదాయం 146 శాతం పెరిగింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 1.13కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 3.53 కోట్ల‌తో 209 శాతం ఆస్తులు పెరిగాయి.

ఈటెల రాజేంద‌ర్

2014లో ఈటెల రాజేంద‌ర్ ఆదాయం 25.05 ఉండ‌గా.. 2018 నాటికి 1.53 కోట్లకు చేరుకుని ఆయ‌న ఆదాయం 511శాతం పెరిగింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 14.51 కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 42.41 కోట్ల‌తో 192 శాతం ఆస్తులు పెరిగాయి.

ల‌క్ష్మారెడ్డి

2014లో ల‌క్ష్మారెడ్డి ఆదాయం 17.82 ఉండ‌గా.. 2018 నాటికి 61.25 బ‌కోట్లకు చేరుకుని ఆయ‌న ఆదాయం 243 శాతం పెరిగింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 77 ల‌క్ష‌లు ఉండ‌గా.. 2018 నాటికి17.29 కోట్ల‌తో 2130 శాతం ఆస్తులు పెరిగాయి.

త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్

2014లో త‌ల‌సాని ఆదాయం 59.23 ఉండ‌గా.. 2018 నాటికి 72.41 బ‌కోట్లకు చేరుకుని ఆయ‌న ఆదాయం 22 శాతం పెరిగింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 15.56 కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 40.30 కోట్ల‌తో 158 శాతం ఆస్తులు పెరిగాయి.

మ‌ర్రి జ‌నార్ధ‌న్

2014లో మ‌ర్రి జ‌నార్ధ‌న్ ఆదాయం 10.76 ఉండ‌గా.. 2018 నాటికి 8.38 కోట్లకు త‌గ్గి ఆయ‌న ఆదాయం -22.14 శాతం త‌గ్గింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 111.48 కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 161.27 కోట్ల‌తో 44.65 శాతం ఆస్తులు పెరిగాయి.

పి. శేఖ‌ర్ రెడ్డి

2014లో పి. శేఖ‌ర్ రెడ్డి ఆదాయం 5.54 ఉండ‌గా.. 2018 నాటికి 4.48 కోట్లకు త‌గ్గి.. ఆయ‌న ఆదాయం 19.22 శాతం త‌గ్గింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 61.96 కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 91.02కోట్ల‌తో 46.90 శాతం ఆస్తులు పెరిగాయి.

అరిక‌పూడి గాంధీ

2014లో అరిక‌పూడి గాంధీ ఆదాయం 67.78 ఉండ‌గా.. 2018 నాటికి 51.69 కోట్లకు త‌గ్గి ఆయ‌న ఆదాయం -22.73 శాతం త‌గ్గింది. ఇక 2014లో ఆయ‌న ఆస్తులు 55.46కోట్లు ఉండ‌గా.. 2018 నాటికి 62.22 కోట్ల‌తో 12.19 శాతం ఆస్తులు పెరిగాయి.