బహిరంగంగానే ఓటుకి నోటు పంచేస్తున్నారన్నమాట..!

Thursday, October 4th, 2018, 11:10:58 AM IST

ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ఇంట్లో ఎంత మంది ఓటు హక్కు కలిగి ఉన్న వారికి డబ్బులిచ్చి మరీ ఓటు వేయించుకుంటారన్న సంగతి తెలిసినదే.ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరైనా కొంత మంది నాయకులు బహిరంగంగా సభ పెడితే ఓటుకి నోటు పంచినట్టు డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెడుతున్నారు.ఇలాగే తమ సభకి వచ్చిన వాళ్లకి వాళ్ళు సభ పూర్తిగా అయ్యేంత వరకు ఉంచి చివరిలో వెళ్లిపోయే ముందు వారి పేర్లు రాసుకుని మరీ చేతికి 200,500 నోట్లు ఇచ్చి పంపించారు తెరాస ప్రభుత్వం వారు.

నిజామాబాద్ జిల్లాలోని నిన్న తెలంగాణా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ప్రజా ఆశీర్వాద సభ ఇప్పుడు ఇతర పార్టీల నోట్లో నవ్వుల పాలవుతుంది.ముఖ్యమంత్రి కెసిఆర్ తమకి ప్రజల్లో అశేషమైన ప్రజాదరణ ఉందని అంటుంటారని,ఇప్పుడు తమ సభకి వచ్చినటువంటి జనానికి అక్కడి స్థానిక కార్పోరేట్లతోనే డబ్బులు పంపిణి చేయడంతోనే ప్రజల్లో కెసిఆర్ కు ఉన్న ఆదరణ తగ్గిపోయిందని విమర్శిస్తున్నారు.నిన్న జరిగిన సభకు వచ్చిన ప్రజల్లో గ్రామాల నుంచి వచ్చిన వారికి 500 రూపాయలు మరియు పట్టణ ప్రాంత ప్రజలకు ఐతే 200 రూపాయలు పంచుతున్న వీడియోలు ఇప్పుడు ప్రసార మాధ్యమాలు,సోషల్ మీడియాలో విపరీతంగా హుల్ చల్ చేస్తున్నాయి.