కాంగ్రెస్ కే ఓటెయ్యమంటున్న తెరాస నేత..షాకింగ్ వీడియో.!

Monday, November 19th, 2018, 08:00:47 PM IST


తెలంగాణా రాష్ట్ర ఎన్నికలకు తక్కువ సమయమే మిగిలి ఉండడంతో అక్కడి పార్టీ నేతలు వారి పార్టీని ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు.అయితే ఎక్కడ అయినా ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీ నేతల మీద ఘాటైన విమర్శలు చేస్తారు కానీ..వారి పార్టీకి కాదని వారి ప్రత్యర్థి పార్టీకి ఓటెయ్యమని ఎవరు చెప్పరు,వారి ప్రత్యర్థి పార్టీకి నినాదాలు పలకరు.అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణా రాష్ట్రంలో ఇలాంటి వింతైన సంఘటన చోటు చేసుకుంది.

ఎన్నికల ప్రచారం చేసి చేసి తెరాస నేత వారి పార్టీ గుర్తుని కూడా మర్చిపోయారు.నిర్మల్ నియోజిక వర్గానికి చెందినటువంటి తెరాస అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు తన ఎన్నికల ప్రచారంలో నోరు జారి వారి అనుచరుల దగ్గరే నవ్వుల పాలయ్యారు.ఎన్నికల ప్రచారం ముగించుకొని చివరిలో కారు గుర్తుకే మన ఓటు అని చెప్పబోయి కాంగ్రెస్ గుర్తు అయినటువంటి చెయ్యి గుర్తుకే మన ఓటు అంటూ పదే పదే నినదించారు,దీనితో ఒక్కసారిగా అక్కడి తెరాస నేతలు అభిమానులు ఖంగుతిన్నారు.వెంటనే వారు అప్రమత్తం చెయ్యడంతో ఏదో అలా కవర్ చేసేసారు.