గులాబీ నేతలకు దమ్ము చాల్లేదనుకుంటా..డబ్బులు పంచుకుంటున్నారు.!

Tuesday, November 6th, 2018, 04:15:17 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఒక్కో పార్టీ నేతలు ఒక్కో రకమైన వ్యూహంతో దూసుకెళ్ళిపోతున్నారు.ప్రజాదరణ ఏ పార్టీకి ఎక్కువ ఉంది అని ప్రశ్న వస్తే దాదాపు తెరాస పార్టీకే ఉంది అనే సమాధానం మనం ఊహించొచ్చు,ఆ పార్టీ నేతలు కూడా అదే చెప్తుంటారు.కానీ ఆ మాటలు అన్ని బయట వరకే ఏమో అన్న సందేహం ఇప్పుడు వస్తుంది.వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అంత అపారమైన ఆదరణ ఉన్నపుడు వారి ప్రచారాల్లో ర్యాలీలకు జనాన్ని పోగెయ్యడానికి జనానికి డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం వస్తుంది,అంటే వచ్చే ఎన్నికల్లో వీరు డబ్బులు పంచకపోతే గెలవలేరా అని ప్రశ్నించినా సరే మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఎన్నికలకు ముందు జనానికి డబ్బులు పంచిపెట్టి వారి ఓట్లను కొనుక్కుంటారన్న సంగతి తెలిసినదే,కానీ ఇక్కడ తెరాస పార్టీ వారు మాత్రం కేవలం ప్రచారానికి జనాన్ని పోగెయ్యడానికే 200 నుంచి 300 ఒక్కో మనిషికి ఖర్చు పెడుతున్నారు,అందులోను ఆ డబ్బు పంచే వారు ఒక 50 నొక్కేసి తక్కిన డబ్బును జనానికి ఇవ్వడంతో ఈ రోజు మిర్యాలగూడా లోని ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.మిర్యాలగూడా లోని తెరాస పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు తన ఎన్నికల ప్రచారానికి డబ్బులిచ్చి జనాన్ని పోగేస్తుండగా వారికి డబ్బులు తక్కువిచ్చారు అంటూ అక్కడి జనం నిరసన చేపట్టడంతో ఈ వార్త తెలిసింది.అంత బలంగా అన్ని వర్గాల వారు మాకు అండగా ఉన్నారు అని చెప్పుకునే గులాబీ నేతలు డబ్బులు ఎందుకు పంచిపెట్టుకుంటున్నారో వారికే తెలియాలి.