కెసిఆర్ ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేకే పొత్తులు..!

Wednesday, October 3rd, 2018, 12:14:05 PM IST

తెలంగాణా రాష్ట్రంలోని ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అన్న వార్త రాగానే ఒక్కసారిగా అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి.ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కెసిఆర్ కు బలం ఎక్కువగానే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకనేనేమో బీజేపీ పార్టీ మినహాయించి మిగతా ముఖ్య పార్టీలు అన్ని పొత్తులు పెట్టుకుంటున్నాయి.ఇప్పుడు ఈ పొత్తుల విషయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఇప్పటికే తెరాస పలు నేతలు కూడా కాంగ్రస్ టీడీపీల పొత్తు పట్ల మరింత స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

కాంగ్రెస్ మరియు టీడీపీలు పొత్తు పెట్టుకుని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని,కెసిఆర్ ను ఎన్నికలలో ఒంటరిగా ఎదుర్కునే దమ్ము లేక పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెరాస మంత్రి హరీష్ రావు అన్నారు.అంతే కాకుండా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని తెలంగాణా ద్రోహి పార్టీగా అభివర్ణించారు,అలాంటిది టీకాంగ్రెస్ తెలంగాణా ద్రోహుల పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారని,వారు పొత్తులు పెట్టుకుంటున్న దానికి కారణాలుగా తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే దాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నది కూడా మేమే అన్నట్టుగా కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.