ఆ గ్రామంలో తెరాస ఎమ్మెల్యే కు ఘోర అవమానం..!

Tuesday, October 9th, 2018, 11:14:22 AM IST

తెలంగాణా రాష్ట్రంలోనే కాదు భారత దేశంలో ఏ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరు చెప్పలేరు.మేము అభివృద్ధి అంత చేశాం అని చెప్పుకునే నాయకులకు ప్రజలే సరైన బుద్ధి చెప్తారు.తెలంగాణలో తెరాస పార్టీకి తిరుగు లేదు అని వారి పార్టీ నాయకులు చెప్పుకుంటారు కానీ కొంత మంది నాయకులు మాత్రం వారు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గ గ్రామాలకు మాత్రం న్యాయం చెయ్యరు.గత కొద్ది రోజుల క్రితమే గోవర్ధన గిరి అనే గ్రామంలో ప్రచారానికి వచ్చిన తెరాస ఎమ్మెల్యేకు అక్కడి గ్రామస్థులు చుక్కలు చూపించారు.ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే మోత్కూర్ మండలంలో చోటు చేసుకుంది.

ముందస్తు ఎన్నికల ప్రచారం నిమిత్తం తెరాస ఎమ్మెల్యే గడారి కిషోర్ కుమార్ మోత్కూర్ మండలానికి ప్రచారానికి విచ్చేసారు.అక్కడ ప్రచారానికి నిమిత్తం సభ ఏర్పాటు చెయ్యగా అక్కడికి వచ్చిన గ్రామస్థులు అసలు నువ్వు మా గ్రామానికి ఏం అభివృద్ధి చేశావని అని అందరు నిలదీసి అడగగా అతనికి ఏం చెప్పాలో అర్ధం కాక సభ మధ్యలోనుంచి వెళ్లిపోయారు.ఆయన కారులో వెళ్లిపోతున్నా సరే కారు వెంబడి కూడా వెళ్లి నువ్ అసలు ఏం చేసావవి వచ్చావ్ అని నిలదీస్తూనే ఉన్నారు దీనితో కిశోరె కుమార్ కు తల కొట్టేసినంత పనయ్యింది,ఇక అక్కడ ఉండకుండా వెంటనే సభాస్థలి నుంచి వెళ్లిపోయారు.