తెరాస ఎమ్మెల్యే ఆసక్తికర వాఖ్యలు – కవిత మంత్రి అవుతారు

Sunday, May 26th, 2019, 09:05:59 PM IST

ఇటీవల తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎంపీ కవితకి ఇక ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందని రాజకీయ నేతలందరూ కూడా చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఎంపీగా ఓటమిని చవిచూసిన కవిత ఇప్పడు మళ్ళీ ఎన్నికల వరకు ఎదురుచూస్తారా లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యురాలిగా పోటీ చేస్తారా అని చర్చలు జరుగుతున్నాయంట. అంతేకాకుండా కెసిఆర్ గారి ఆజ్ఞ మేరకు కవితను ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ సందర్భంగా మాట్లాడిన నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీగా ఓడిపోయినా కూడా కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ అయి కూడా మంత్రి పదవిని దక్కించుకోవచ్చని తెరాస ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. కాగా పార్టీ కార్యకర్తలందరు కూడా మరింతగా కస్టపడి ఉంటె మాత్రం తప్పకుండ కవిత గెలిచేది, అన్నారు. అయితే ఇప్పటికి కూడా మంత్రిగా తిరిగొస్తుందని చెప్పారు. అయితే నిజామాబాదు లో తెరాస ఓటమికి బాధ్యత తీసుకుంటూ, కవిత ఓటమికి గల కారణాలను ఆరాతీసే పనిలో పడ్డారని సమాచారం. కాగా ఇప్పటికే ఈ విషయాన్నీ కెసిఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.