మ‌హిళ‌తో ఎమ్మెల్యే రాజయ్య‌ స‌ర‌సం టేప్ లీక్

Tuesday, September 11th, 2018, 11:13:33 PM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌ల మంట మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ మంట‌ ఏకంగా ఉప‌ముఖ్య‌మంత్రి లైఫ్‌లైన్‌కే ఎస‌రు పెట్టేటుంది! స‌ద‌రు ఉపముఖ్య‌మంత్రి వ‌ర్యులు ఓ మ‌హిళ‌తో స‌ర‌స‌మాడుతున్న ఆడియో టేప్ మీడియా చేతికి చిక్కింది. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం దీనిని తెలివిగా రికార్డ్ చేయించి ఎల‌క్ష‌న్ ముంగిట ఇలా తెలివిగా వాడేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం ఆ ఆడియో టేప్ అటూ ఇటూ జ‌నాల వాట్సాప్‌ల‌లో చ‌క్క‌ర్లు కొట్టేస్తోంది. దీంతో స‌ద‌రు పెద్దాయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జనగామ జిల్లా- స్టేషన్ ఘనపూర్ లో రాజకీయ సమీకరణలు మారిపోవ‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం సాగుతోంది. “మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన తొలి ఉపముఖ్యమంత్రి రాజయ్య ఆడియో టేప్“ అంటూ ఇప్ప‌టికే బోలెడంత ప్ర‌చారం సాగిపోతోంది. ఈ ఆడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లోకి పాకిపోయింది. ఈ కాల్ రికార్డ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అయితే ఈ ఆడియో టేప్‌ బయట పడకుండా రాజయ్య జాగ్రత్త ప‌డేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. ఎలానూ లీకైపోయిన‌దానిని ఎక్క‌డ‌ని ఆప‌గ‌ల‌రు? అందుకే పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని జ‌నంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం రాజ‌య్య వ‌ర్గం దిక్కుతోచని సన్నివేశంలో ప‌డిపోయింద‌ని మాట్లాడుకుంటున్నారు. పొలిటిక‌ల్ కుట్ర‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకునేందుకు ఇదొక ఎగ్జాంపుల్ మాత్ర‌మే. రాజ‌కీయం కోసం, ప‌ద‌వుల కోసం ఎంత నీచానికైనా దిగ‌జార‌డం అనాదిగా ఉన్న‌దే. ఇప్పుడిలా ఏకంగా బెడ్‌రూమ్‌నే రోడ్డుపైకి తెచ్చేస్తున్నారు. అయితే ఉపముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి ఇలా ఓ మ‌హిళ‌తో స‌ర‌స‌మాడ‌డం.. ఇకఇక‌లు ..ప‌క‌ప‌క‌లు సాగించ‌డం అన్న‌ది ఎంత వ‌ర‌కూ స‌బ‌బు? అంటూ పెద్ద డిబేట్ సాగుతోంది. ఇదివ‌ర‌కూ ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి చానెల్ 70ఏళ్ల గ‌వ‌ర్న‌ర్‌పై ఇలాంటి స్టింగ్ ఆప‌రేష‌న్ వీడియోని బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ స‌ర‌సాలు అంటూ పెద్ద బ్యాన‌ర్ వార్త‌ల్నే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ప్ర‌చురించింది.

  •  
  •  
  •  
  •  

Comments