లైంగిక దాడి కేసులో టిఆర్ఎస్ ఎంపీ!

Friday, July 6th, 2018, 06:10:45 PM IST

టిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పై లైంగిక దాడి కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయన కొందరు మహిళలను లైగికంగా వేధించారని కొందరు జర్నలిస్టులు నరేంద్రమోడీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. విషయం ఏమిటంటే, గత మే నెల 31న ఇద్దరు మహిళలు మరియు పురుషులు బంజారా హిల్స్ లోని ఎంపీ సుమన్ గారి అపార్ట్మెంట్ కి వచ్చి సుమన్ ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్లారు అని అడిగి, ఆయన లేరు అని చెప్పడంతో నానారకాలుగా దుర్భాషలాడి, బెదిరించి అయన మంచిర్యాలకు ఎలా వస్తారో చూస్తామని వెళ్లిపోయారు అట. అయితే ఈ విషయమై మరుసటిరోజు బంజారాహిల్స్ పోలీస్ లకు అయన పిఎ సునీల్ ఫిర్యాదు చేసారు. అయితే సునిల్ చెపుతున్నట్లు వచ్చిన వారు నిందితులో, లేదా మరెవరో కారని, వారు సుమన్ చేత లైంగిక దాడికి గురైన బాధితులని జర్నలిస్టులు లేఖలో తెలిపారు.

అయితే సునీల్ ఇచ్చిన ఫిర్యాదులో వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసువాలని కోరగా, ఎఫ్ఐఆర్ లో ఎంపీ పేరును చేర్చకుండా పోలీస్ లు కేసు నమోదు చేశారట. ఆ తరువాత నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నిందితులనుండి వివరాలను బలవంతంగా తీసుకుని, ఎంపీతో వారికున్న సంబంధాన్ని బయటపెడితే మీ అంతు చూస్తామని బెదించారని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, మరియు మహిళా కమీషన్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేసి ఎంపీ సుమన్ పై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆయనపై సీబీఐ విచారణ చేపట్టాలని కూడా లేఖ ద్వారా డిమాండ్ చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments