వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు రాని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడెలావస్తున్నారు..?

Friday, September 21st, 2018, 03:16:14 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి పట్టును సారించే దిశగా అడుగులు వేస్తుంటే తెరాస పార్టీ నాయకులు వారి మీద విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు.అస్సలు కాంగ్రెస్ ప్రభుత్వం వారు తెలంగాణా కోసం ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. తెరాస ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వారు చేసిన ఒక్క మంచి పని చెప్పమన్నారు,ఎవరో ఒకరు ఇద్దరు నాయకుల మినహా తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడిన కాంగ్రెస్ నాయకుడు ఒక్కరు కూడా లేరని అలాంటప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఓట్లు వేయమని అడిగే హక్కు వాళ్లకి ఎలా ఉంటుందని తెలిపారు.

2004 నుంచి 2009 వరకు అసలు తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీల పాత్రనే లేదని పేర్కొన్నారు.అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినపుడు సీఎం తో పాటు తెరాస ఎమ్మెల్యేలు 32 మంది పార్టీ ఆఫీసులకు తిరిగి తెలంగాణా రాష్ట్రం ఎందుకు కావాలో తెలియజేసినపుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు అయినా తెలంగాణా రాష్ట్ర మద్దతు కోసం వచ్చారా?అని అడిగారు ఆ తర్వాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత వరకు ఒక్కరు కూడా బయటకి రాకుండా ఆయన మరణించాక తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు ఉదృతం చేసినపుడు చివరిలో ప్రజలకు భయపడి మద్దతు ఇచ్చారని తెలిపారు.అలాంటి మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీ వల్లే వచ్చింది అని ఎలా చెప్పుకుంటారు అని ప్రశ్నించారు.