తెరాస పార్టీకి అడుగడుగునా నిరసనలు..బ్యానెర్లు చించి పారేసిన ఆ గ్రామస్థులు.!

Sunday, October 28th, 2018, 05:46:44 PM IST

తెలంగాణా రాష్ట్రంలోని ఇప్పటి వరకు అక్కడి తెరాస నేతలు మరియు కెసిఆర్ సర్కారు ప్రజల్లో బలంగా ఉన్నా పార్టీ ఏదన్నా ఉంది అంటే అది మాదే అని,ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా సరే ప్రజలు అదే చెప్పి మాకు మద్దతుగా ఉంటారని చెప్పుకుంటూ వచ్చారు.అది వారి మాటల వరకే..కానీ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి చూస్తే మాత్రం తెరాస పార్టీ నేతలకు ఉన్నంత వ్యతిరేకత ఏ పార్టీకి కూడా లేదనే చెప్పాలి ఎందుకంటే గడిచిన ఈ రెండు నెలల్లోనే దాదాపు ఐదు నుంచి ఆరు చోట్ల అందులోను గ్రామాల్లోనే తెరాస పార్టీ నేతలకు నిరసన సెగలు తీవ్ర స్థాయిలో తగులుతున్నాయి.వారి పార్టీ ప్రచారానికి వస్తున్నటువంటి తెరాస నేతలను వారి గ్రామంలోకి రానివ్వకుండా వెనక్కి తిరిగి తరిమేస్తున్నారు.

ఇప్పుడు ఇలాంటి సంఘటనే తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో చోటు చేసుకుంది.అక్కడ తెరాస అభ్యర్థి సతీష్ బాబు ఎన్నికల ప్రచారానికి వెళ్లగా అక్కడి ప్రజలు వారి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఆందోళనలు చేపట్టారు. అంతే కాకుండా మా అనుమతి లేకుండా మా గ్రామంలో వారి పార్టీకి చెందిన జెండాలు బ్యానెర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు.ఇప్పటివరకు వారి గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్యలను పారిశుధ్య సమస్యలను తీర్చనటువంటి వారు ఇప్పుడెలా ఓట్లు అడగడానికి వచ్చారని,అందుకనే వారి పార్టీ యొక్క జెండాలను బ్యానెర్లను చించేశామని అక్కడి స్థానికులు తెలిపారు.