భారీ స్థాయి ప్రచారానికి కేసిఆర్ సిద్ధం..!

Tuesday, October 30th, 2018, 11:45:28 AM IST

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే, అయితే కేసిఆర్ వైద్య పరీక్షల కోసమే ఢిల్లీ వెళ్లారని సీఎం కార్యాలయం నుండి ప్రకటన వచ్చినా కూడా దీని వెనక రహస్య రాజకీయ ఎత్తుగడ ఉన్నట్టు ఇతర పక్షాల వారు అనుమాన పడ్డారు. అయితే అయన ఢిల్లీ వెళ్లి రాగానే భారీ బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ప్రణాళిక సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాలన్నది కెసిఆర్ ప్లాన్ అని తెలుస్తుంది. నవంబర్ మొదటి వారం లో ఈ మూడు సభలు నిర్వహించనున్నారు, ఈ సభలకు గాను ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది. నవంబర్ 19 తర్వాత వీలైనన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసి రెండోసారి తెరాస ను అధికారంలోకి తేవడమే కేసిఆర్ భావిస్తున్నారట. అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకి సిద్దపడి అన్ని పార్టీలను షాక్ కి గురి చేసిన కెసిఆర్, అంతే దూకుడుగా అన్ని పార్టీలకంటే ముందుగా అన్ని స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించి తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. అయితే ఈ దూకుడు ప్రచారం లో కూడా ఉంటుందా, అది ఎంతవరకు ఫలితాన్నిస్తుంది అన్నది వేచి చూడాలి.