చెన్నూరులో రగులుతున్న టీఆరెస్ నేతల రాజకీయం!

Wednesday, September 12th, 2018, 06:39:22 PM IST

రాజకీయాల్లో ఎంత ఆలోచనతో ప్రణాళికలు రచించిన సొంత గూటిలోనే ఇబ్బందులు తప్పవని మరోసారి రుజువయ్యింది. సాధారణంగా కేసీఆర్ తన నేతలను చాలా సాఫ్ట్ గా డీల్ చేసి మంచి నడవడికతో ఉండేలా చూస్తారని ఒక టాక్ ఉంది. కానీ టికెట్ల విషయం వచ్చే సరికి ఎంత అనుభవం ఉన్న నేతలైన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్ధమవుతోంది. ఇటీవల చెన్నూరు నియోజకవర్గ సిట్టింగ్ అభ్యర్థి నల్లెల ఓదెలును తప్పించి ఎంపీ బాల్క సుమన్ కి పార్టీ టికెట్టు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ వివాదం గట్టిగా ముదిరినట్లు తెలుస్తోంది. ఓదెలు వర్గం వారు నేడు బాల్క సుమన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరో నలుగురికి ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వారిని వెంటనే హాస్పటల్ కి తరలించారు. అయితే ఘటనపై బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై హత్యాయత్నం చేశారని ఎవరు అడ్డుపడినా చెన్నూరు నుంచి తాను పోటీ చేసి తీరుతానని వ్యాఖ్యానించారు. అదే విధంగా తనకు కేసీఆర్ తనకు ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ను కేటాయించారని చెబుతూ.. ఓదేలు వర్గం ఎన్ని కుట్రలు చేసినా తన నిర్ణయాన్ని ఏ మాత్రం మార్చుకునేది లేదని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments