హ‌వ్వ‌! ప్రగ‌తి ట్రాక్ట‌ర్లు .. షాక్ తిన‌డం గ్యారెంటీ!

Sunday, September 2nd, 2018, 02:00:29 AM IST

ఇది వింత‌ల్లోకెళ్ల వింత‌! కామన్‌మేనే కాదు.. పైవాడే న‌వ్వుకునేంత వింత‌!! క‌నీవినీ ఎరుగ‌ని మ‌హా గొప్ప విచిత్రం!!! చూశారా.. ఇది చూశారా.. చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. అస‌లు ఈ ప్ర‌గ‌తి ర‌థం ఎలా సాగుతోందో. తెలంగాణ‌లో తేరాస ప్ర‌భుత్వం అంత తోపు లేదా? అస‌లు కేసీఆర్ ని కొట్టే మొన‌గాడే లేడా? ఆయ‌న ప్ర‌గ‌తి ముందు అన్ని పార్టీలు బోల్తా ప‌డిపోయాయా? హ‌వ్వ‌! అస‌లు ప్ర‌గ‌తి ఇలా ఉంది. ప్ర‌గ‌తి స‌భ కోసం ఏకంగా ఊరూ వాడా నుంచి 25 ల‌క్ష‌ల మంది జ‌నాల్ని త‌ర‌లించాల‌ని తేరాస ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బ‌స్సులు, స్కూలు బ‌స్సులు, ట్రాక్ట‌ర్లు, ప్ర‌యివేటు వాహ‌నాలు .. ఒక‌టేమిటి వీలున్న అన్ని వెహిక‌ల్స్ బుక్ చేసింది.

ఇబ్ర‌హీం ప‌ట్నంలో కొంగ‌ర క‌ల‌న్ ప్రాంతం మొత్తం ఏర్పాట్ల‌తో హోరెత్తిపోతోంది. అయితే ఏం లాభం? ఇక్క‌డికి బ‌య‌ల్దేరిన ట్రాక్ట‌ర్లు ఏ తీరుగా ఉన్నాయో మీరే చూడండి. బండెన‌క బండి క‌ట్టి.. ఏ బండ్లో పోత‌వ్ కొడ‌కో..! అన్న చందంగా ఇదిగో వ‌రుస‌గా బండెన‌క బండి క‌ట్టి ట్రాక్ట‌ర్ల‌న్నీ ఎలా వెళుతున్నాయో? ఎక్క‌డైనా ట్రాక్ట‌ర్ ఎక్కిన జాడ క‌నిపిస్తోందా? పిట్ట క‌నిపిస్తే మీమీద ఒట్టు! ఇలా అయితే స‌భ‌కు పాతిక ల‌క్ష‌ల మంది ఎలా వ‌స్తారు? క‌నీసం సినిమా జూనియ‌ర్ ఆర్టిస్టులకు రోజుకు రూ.1000 చొప్పున ఇచ్చినా బోలెడంత మంది పోగ‌య్యేవారు. అయ్యో పాపం.. ఆ ట్రాక్ట‌ర్ల ధీనావ‌స్థ చూశారా? ఒక్క డ్రైవ‌ర్ త‌ప్ప ఇంకెవ‌డైనా ట్రాక్ట‌ర్ ఎక్కితే ఒట్టు! హ‌వ్వ .. హ‌వ్వ‌.. తేరాస వాస్త‌వ‌ ప‌రిస్థితి ఇదీ. అస‌లింత‌కీ బ‌స్సుల్లో అయినా జ‌నం వ‌స్తున్నారంటారా? అన్న‌ట్టు ఇంత ఖాళీగా ఆ ట్రాక్ట‌ర్లు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు ఎందుకు వెళుతున్న‌ట్టు? ముఖ్యంగా ఖ‌మ్మం ఏరియాలో తేరాసపై పూర్తి వ్య‌తిరేక‌త నెల‌కొంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో అయితే పీక‌ల వ‌ర‌కూ ఉంది!!

  •  
  •  
  •  
  •  

Comments