ఉరేసుకుంటానంటున్న టిఆర్ఎస్ రెబల్ !

Wednesday, October 17th, 2018, 10:19:07 PM IST

పార్ట్ విధానాలకు, నిర్ణయాలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని, కాంగ్రెస్ నేతలతో లోపాయికారి వ్యవహారాలు నడుపుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ ను ఉన్నపళంగా పార్టీ నుండి తీసిపారేశారు కేసిఆర్. 2014 నుండి పార్టీలో ఉంటూ, అన్ని విధాలా కేసిఆర్ కు సహకరించిన తనకు ఇలాంటి గతి పట్టిస్తారా అంటూ రాములు నాయక్ తీవ్ర మనస్తాపానికి గురై కన్నీళ్లు కూడ పెట్టుకున్నారు.

ఈరోజు కూడ మీడియాతో మాట్లాడిన ఆయన నారాయణఖేడ్ నుండి ఇండిపెండెంట్ భరిలో నిలబడతానని, దమ్ముంటే భూపాల్ రెడ్డిని కూడ అలాగే స్వతంత్ర్యంగా నిలబడి తనపై గెలవమని సవాల్ చేశారు. అంతేకాదు ఒకవేళ తాను ఓడిపోతే ఉరేసుకుంటానని ఛాలెంజ్ చేశారు. తాను కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపినట్టు నిరూపించమని, ఎలాంటి పరీక్షకైనా తాను సిద్డమని అన్న అయన గులాబీ పార్టీని శాశ్వతంగా మూసేయడానికి మందకృష్ణ మాదిగ, ఆర్. క్రిష్ణయ్యలను తనతో చేతులు కలపమని ఆహ్వానించారు నాయక్.

గిరిజనుల్లో మంచి పట్టు ఉండి, ప్రజల వద్ద, ఇతర నాయకుల వద్ద సౌమ్యుడనే పేరు తెచ్చుకున్న రాములు నాయక్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల ప్రజల్లో కూడ కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకతను గనుక నాయక్ తనకు అనుగుణంగా మార్చుకోగలిగితే టిఆర్ఎస్ కొత్త చిక్కుల్లో పడ్డట్టే.

  •  
  •  
  •  
  •  

Comments