టీవీ9ని కొనేసిన టీఆర్ఎస్ షాడో!!

Friday, October 12th, 2018, 10:21:10 AM IST

శ్రీ‌రెడ్డిని అడ్డుపెట్టుకుని ప‌వ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టాల‌ని చాలా మంది నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేశారు. అందులో టీవీ9 పాత్ర ప్ర‌ముఖమైన‌ద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. త‌న‌పై వీరంగం సృష్టించిన‌ టీవీ9 మేజ‌ర్ షేర్ హోల్డ‌ర్‌ శ్రీ‌నిరాజు బండారం బ‌య‌ట‌పెడ‌తానంటూ ఆ మ‌ధ్య ప‌వ‌న్‌క‌ల్యాన్ శివాలెత్తిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఎగ్జిస్టెన్సీ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీవీ9 వేరే వ్య‌క్తి చేతుల్లోకి వెళుతోందంటూ గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ టీవీ9ని కొనేదెవ‌రు? అంటే ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. అధికార టీఆర్ ఎస్ కు స‌న్నిహితంగా మెలిగే మైహోమ్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్‌రావు అన్న ప్ర‌చారం సాగుతోంది. గ‌త కొంత కాలంగా టీవీ9 యాజ‌మాన్యంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న ఆయ‌న తాజాగా టీవీ9 సంస్థ‌ను సొంతం చేసుకున్నార‌ని చెబుతున్నారు.

ఈ వార్త‌ను ఏబీసీఎల్ కొన్ని గంట‌ల్లోనే బ్రేక్ చేసింది. గ‌త కొంత కాలంగా ర‌విప్ర‌కాష్ సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఛాన‌ల్‌ని మై హోమ్ గ్రూప్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర్‌రావుతో పాటు మేఘ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. అయితే ఇందులో ఎక్కువ షేర్ మై హోమ్ రామేశ్వ‌ర్‌రావుదే కావ‌డంతో తేరాస‌ వ‌ర్గాల‌కు వ‌రంగా మారే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. మేజ‌ర్ మీడియా హౌజ్ త‌మ‌కు చెందిన వారి క‌నుస‌న్న‌ల్లో న‌డ‌వ‌డం పార్టీకి లాభాన్ని చేకూర్చే ఆంశ‌మ‌ని పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మై హోమ్ రామేశ్వ‌ర్‌రావు టీవీ 9 తెలుగుకు సంబంధించిన స‌ర్వ హ‌క్కుల్ని సొంతం చేసుకోగా క‌న్న‌డ‌, గుజ‌రాతీ, మ‌రాఠీ ఛాన‌ల్స్‌ని మాత్రం మేఘ ఇన్‌స్ట్ర‌క్ష‌ర్స్ లిమిటెడ్ కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని పాన్ ఇండియా బిజినెస్‌ని ప్ర‌భావితం చేయాల‌ని రామేశ్వ‌ర్‌రావు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో త‌న‌కు అధికార పార్టీ అండ‌దండ‌లు అందించింది కాబ‌ట్టి కృత‌జ్ఞ‌త‌గా టీవీ9 ద్వారా టీఆర్ ఎస్‌కు మీడియా ప‌రంగా వెన్నెద‌న్నుగా నిల‌వాల‌ని భావిస్తున్నాడ‌ట జూప‌ల్లి రామేశ్వ‌ర్‌రావు. ఇది తెలిసిన రాజ‌కీయ విశ్లేష‌కులు ఇక టీఆర్ ఎస్‌కు పండ‌గేన‌ని విశ్లేషిస్తున్నారు.