కేసీఆర్ పై భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు !

Friday, October 12th, 2018, 11:02:00 AM IST

ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే రాజకీయ పార్టీలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటాయి. ఇప్పటికే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై రూపొందించిన ప్రకటనలు టీవీ మాధ్యమాల్లో హడావుడి చేస్తుండగా తెలంగాణాలో కేసిఆర్ కూడ ప్రచార పర్వాన్ని షూరూ చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో కేసిఆరే తమ అస్త్రమని చెప్పుకుంటున్న గులాబీ నేతలు ఇప్పటికే ఆయనపై కొన్ని ప్రకటనల్ని రెడీ చేసేశారు.

మూడు, ఐదు నిముషాల నిడివి ఉన్న ఈ సందేశాల్లో తెలంగాణ ఉద్యమ పోరాటం, చేసిన మంచి, అమలుపరిచిన రైతు బంధు, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అన్ని అంశాలను టచ్ చేస్తారట సిఎం. ఇప్పటికే ప్రచార సామగ్రి కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన పార్టీ ఈ డిజిటల్ ప్రచారం కోసం కూడ భారీ మొత్తాన్నే కేటాయించింది, ఇకపై టీవీలు, సోషల్ మీడియాల్లో ఇవే దర్శనమివ్వనున్నాయి.

పార్టీ బహిరంగ సభలు, రోడ్ షోల్లో కూడ వీటిని విరివిగా వినియోగించాలని ఆదేశించిన కేసిఆర్ పలు జిల్లాలో చేయాల్సిన ప్రచార కార్యక్రమాల్ని ఇటీవలే ఫైనల్ చేసేశారు. మొత్తంగా అన్ని రకాల ప్రచార కార్యక్రమాలకు కలిపి పార్టీ మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తోంది.