ఆపరేషన్ ఆకర్ష్ – మహాకూటమే టార్గెట్…!

Friday, November 2nd, 2018, 03:41:13 PM IST

రాజకీయాల్లో ఒక పార్టీ నేతలు ఇంకో పార్టీలో చేరటం సర్వ సాధారణ విషయం, ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో, ఎన్నికల తర్వాత అధికార పార్టీలోకి వలసల తాకిడి ఎక్కువుంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నెలకొంది. మహాకూటమి లోని ఒక పార్టీ లక్ష్యంగా అధికార తెరాస పార్టీ ఆపేరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది.

మహాకూటమిలో చాలా రోజుల తర్జన భర్జనల తర్వాత సీట్ల సర్దుబాటు అనే అంకం పూర్తయింది, ఇక అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికకు ముందే ఈ ఆపరేషన్ ఆకర్ష్ దాటికి మహాకూటమికి పెద్ద షాక్ తగిలేలా ఉంది. సీటు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు కచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది. ఇలా అభ్యర్థుల ఎంపికకు ముందే ఆపెర్షన్ ఆకర్ష్ ద్వారా మహాకూటమిని బలహీన పరచాలన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ తెలంగాణలో సిపిఐ కాస్త నిలదొక్కుకున్నట్టే కనిపిస్తుంది. ఇపుడు ఆ పార్టీనే తెరాస టార్గెట్ చేసింది, ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా సిపిఐ ని బలహీన పరిస్తే మహాకూటమి నిర్వీర్యం అయినట్టే, ఆ రకంగా అధికార పార్టీ ప్రణాళిక రచిస్తుందట. ఇదంతా పక్కన పెడితే అధికార పార్టీ గాలానికి సిపిఐ చిక్కుతుందా, తప్పించుకుంటుందా అన్నదే ప్రశ్న.

గ్రామాల్లో పట్టున్న సిపిఐకి చెందిన నేతల్ని పార్టీలో చేర్చుకుంటే తమకు లభిస్తుందని, ఆ రకంగా సిపిఐ ని దెబ్బ తీసి మహాహకూటమి ఇరకాటంలో పెట్టడమే ఈ ఆపరేషన్ లక్ష్యంగా కనిపిస్తుంది. మహాకూటమి తో పొత్తు వాళ్ళ తమకు ఆశించిన సీట్లు రావన్న భావనలో ఉన్న నేతలు ఇప్పటికే అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా తెరాస గనక ఆపరేషన్ లో సక్సెస్ అయితే మహాకూటమిలో కొంతవరకు కుదుపు తప్పదనే చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో.