కాంగ్రెస్ మ్యానిఫెస్టోకి ధీటుగా తెరాస మ్యానిఫెస్టో..!

Sunday, September 16th, 2018, 11:59:39 AM IST

తెలంగాణా ముందస్తు ఎన్నికల నిమిత్తం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సంగంతి తెలిసిందే.అదే విధంగా తమ పార్టీ నుంచి ఈ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు అని కూడా దాదాపు 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా కెసిఆర్ విడుదల చేశారు. అయితే అక్కడ ఉన్న వారి ప్రధాన ప్రతిపక్షం అయ్యినటువంటి కాంగ్రెస్ ఈ సారి ఎలా అయినా సరే తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ జెండాను పాతాలని ప్రజలకు కెసిఆర్ చేసిన అన్యాయాలను మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క మానిఫెస్టోను బలంగా తీసుకెళ్తున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ వారి పార్టీ జెనరల్ కేశవరావు గారు మరియు వారితో ఒక 15 మంది సభ్యుల తో పాటు ఈ ఎన్నికల మ్యానిఫెస్టోని పొందుపరచడానికి కెసిఆర్ నియమించారు,ఐతే కాంగ్రెస్ వారు ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ, పెన్సన్ పెంపు, నిరుద్యోగ భృతి,రేషన్ లో సన్నని బియ్యం ఇలా ఎన్నో పథకాలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం లో దూసుకెళ్లిపోతుంది.వీరికి బ్రేక్ వేయడానికే కెసిఆర్ ఈ సభను ఏర్పాటు చేయించి వారికి దిశా నిర్దేశం చేశారు.ఈ సారి తెరాస వారు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇంకా ఇతర హామీలను కూడా ఈ సారి జత చేస్తున్నాం అన్నట్టు తెలిపారు.ఈ మ్యానిఫెస్టోను ముఖ్యంగా మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత మరియు వృద్ధులు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది.దాదాపు 20 వర్గాల నుంచి వచ్చిన వినతి పత్రాల మేరకు తెలీనంగాణ భవన్ లో కమిటి సభ్యులు మానిఫెస్టోని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ ఎన్నికల నిమిత్తం మరో 2 లేదా 3 సార్లు మళ్ళీ కమిటి ఉంటుందని ఆ తర్వాత వారు మూడు నుంచి నాలుగు నెలల్లో వారి యొక్క మ్యానిఫెస్టోను ప్రకటిస్తాం అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments