‘కొత్త’ గులాబీ గెలుపు..!

Tuesday, September 16th, 2014, 01:45:26 PM IST


మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో ‘కొత్త’ గులాబీ పార్టీ మళ్లీ విజయ దుందుభి మోగించింది.అనుకున్నట్టుగానే అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. మూడు లక్షల పైచిలుకు మెజారీటీతో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. ఇక రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. చివరకు కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.

తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు టీఆర్‌ఎస్ అత్యధిక మెజార్టీతో దూసుకెళ్లింది. మొత్తం 14 రౌండ్లలో కౌటింగ్ జరిగింది. టీఆర్‌ఎస్‌కు -4,37,020, కాంగ్రెస్‌కు -1,60,120, బీజేపీకి -1,36,425 ఓట్లు వచ్చాయి.

గత ఎన్నికల్లో మెదక్ లోకసభ స్థానం నుంచి కేసీఆర్ 3.97 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారీ అదే స్థాయి మెజార్టీ లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించాయి. రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్‌లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి.. కేసీఆర్ మెజారీటిని అందుకోలేక స్వల్పంలోనే వెనకబడిపోయారు.

మెదక్ లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ నూతన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధన్యావాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారని, తమపట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచి ఓటు వేశారని తెలిపారు.