ప్రపంచ పెను ముప్పు సమస్యను పరిష్కరించాం: ట్రంప్

Tuesday, June 12th, 2018, 06:50:50 PM IST

గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా అమెరికాల మధ్య సాగుతున్న వైరం ఏ స్థాయిలో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుసగా ఉత్తర కొరియా అణుపరీక్షలను చేసి ప్రపంచ దేశాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ డోస్ ఎక్కువయ్యింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ కూడా తరచు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం అందరిని భయాన్ని కలుగుగజేసింది. ఈ రెండు దేశాల కారణంగా పక్క దేశాలు చాలా బయపడ్డాయి.

ఇక ఆ విధంగా బయపడల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైనల్ గా సింగపూర్ లో జరిగిన భేటీలో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చారు. ముఖ్యంగా ట్రంప్ అయితే చాలా వరకు సున్నితంగా మాట్లాడారు. ఇప్పటి నుంచి ఇరు దేశాలు చాలా స్నేహంగా ఉంటాయని కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిలటరీ కార్యకలాపాలు ఆపేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎవరికీ మంచిది కాదు. ఎక్కువగా ధనం వృధా అవుతోంది. అందుకే ఇరు దేశాలు స్నేహంగా ఉండడానికి డిసైడ్ అయ్యాం. త్వరలో ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ ను వైట్ హౌస్ కి ఆహ్వానించనున్నట్లు, ప్రపంచానికి పెను ముప్పుగా మారిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments