నేను అస్సలు ఊరుకోను.. అణుదేశాన్ని అణచివేస్తా: ట్రంప్

Wednesday, January 31st, 2018, 02:26:52 PM IST

గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా – అమెరికా మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికి తెలిసిందే. తమ దేశంపై పెత్తనం కొనసాగించాలని అమెరికా చూస్తుందని ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తర కొరియా అధ్యక్షుడు అనేక విధాలుగా అణు పరీక్షలను చేస్తూ..అతనికి ఆగ్రహాన్ని తెప్పిస్తూన్నాడు. అమెరికా ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి అణు పరీక్ష నిర్వహిస్తూ.. బయపెడుతున్నాడు.

అయితే అమెరికా అధ్యక్షడు ట్రంప్ కూడా చాలా సార్లు హెచ్చరికలను జారీ చేశాడు. ఇక రీసెంట్ గా తన అసహనాన్ని మరోసారి చూపించాడు. తమ బలం ఏంటో ఉత్తర కొరియాకు చూపిస్తామని శపధం చేశాడు.
ఆ దేశం తీరు వల్ల అమెరికా భద్రత ప్రమాదంలో పడిందని అలా జరగడానికి కారణం అమెరికా గత ప్రభుత్వాలే అని ట్రంప్ తేల్చి చెప్పాడు. అప్పుడే ఉత్తర కొరియాకు సరైన సమాధానం చెప్పి అదుపులో ఉంచుకుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ట్రంప్ మాట్లాడాడు. ఇక తాను మాత్రం ఆ విధంగా ఫెయిల్ కానని తప్పకుండా ఉత్తర కొరియాకు గట్టి సమాధానాన్ని చెబుతానని ట్రంప్ వివరించాడు.