మీడియా వారి పై ట్రంప్ చిందులు!

Thursday, June 14th, 2018, 08:51:25 PM IST


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతృత్వ విధానాల వల్ల ఇప్పటికే అక్కడ ఉంటున్న కొన్ని దేశాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జియాంగ్ వున్ పై ఒకింత అసహనం వ్యక్తం చేయడం, అప్పటికే అమెరికాపై కోపంగా వున్న కిమ్ తమకు ఆగ్రహం తెప్పించేలా అమెరికా కనుక చర్యలు చేపడితే తాము ఎంతటి అణు విద్వాంసానికైనా సిద్ధమవుతామని చెప్పిన మాటలు అప్పట్లో పెను సంచలమే రేపాయి. కాగా రెండు రోజుల క్రితం అనూహ్యంగా వీరిద్దరూ సింగపూర్లో మర్యాదపూర్వకంగా కలుసుకోవడం అలానే రెండు దేశాల అణ్వాయుధ మరియు భద్రత సంబంధాల మధ్య చర్చలు జరగడం, అవి ఫలించడం జరిగిపోయాయి. ఇక చర్చల అనంతరం ఇక రెండు దేశాలు మిత్ర దేశాలని, ఇకపై ఇరువురము తమ తమ దేశాల ప్రజలకు శాంతితో కూడిన జీవనాన్ని అందించనున్నట్లు తెలిపాయి. నిరాయుధీకరణకు ఉత్తర కొరియా దేశం ఒప్పుకున్న సందర్భంలో ప్రపంచం ఒక భారీ అణు విపత్తు నుండి ఒక్క అడుగు వెనక్కి వేసిందని ట్రంప్ కొనియాడారు.

అయితే భేటీ అనంతరం అమెరికా తిరిగి పయనమైన ట్రంప్ నేడు సోషల్ మీడియా వేదికగా వారిద్దరి భేటీ విషయమై మీడియా రాద్ధాంతం చేసిందని, లేనిపోని అబద్దాలు రాసి ప్రజలను గందరగోళంలో పడేసిందని మండి పడ్డారు. ముఖ్యంగా సిఎన్ఎన్, ఎన్బిసి మీడియా వారు లేనిపోని నకిలీ ప్రచారాలు చేయడానికి వారు పడ్డ కష్టం చూస్తుంటే నవ్వువస్తోందని అన్నారు. అలానే కొందరు నిపుణులు సైతం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నారు. ఇటువంటి మీడియా సంస్థలవారు దాదాపు 500 రోజుల క్రితం ఏదో పెద్ద విధ్వంశం జరుగబోతోంది అని గగ్గోలు పెట్టారు అన్నారు. నిజానికి అటువంటి వారే అమెరికాకు నిజమైన శత్రువులని, కావున వారు అటువంటి వ్యాఖ్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని అన్నారు……