సాహో ఇండియన్స్ అంటున్న ట్రంప్….!

Wednesday, January 25th, 2017, 09:15:00 AM IST

Donald-Trump-says-Brexit-a-
అందరూ అనుకుంటున్నట్టుగా ట్రంప్ భారత్ కు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చెయ్యట్లేదు. పైగా అక్కడి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పోస్ట్ లకు భారతీయులనే ట్రంప్ తీసుకుంటున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ఆ తరువాత తన పాలనలో వేగాన్ని పెంచారు. వరుసగా పలు దేశాల అధ్యక్షులతో మాట్లాడి ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇరు దేశాల మధ్య సంబంధాలు, సమస్యలు వంటి వాటిపై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మంగళవారం రాత్రి 11 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు.

మోడీతో ట్రంప్ మాట్లాడిన రోజే వైట్ హౌస్ నుండి భారతీయులకు ఒక తీపి కబురు అందింది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పోస్టుకు ఒక భారతీయుడిని ట్రంప్ ఎంపిక చేసినట్టు ప్రకటించింది. అమెరికాలోని కీలక పదవులకు భారతీయులను తీసుకోవాలని ట్రంప్ కూడా అనుకుంటున్నారు. నెట్ న్యూట్రాలిటీని వ్యతిరేకించిన అజిత్ వరదరాజ పాయ్ ను ఫెడరల్ కమ్యూనికేషన్ చీఫ్ గా నియమించారు. నీకీ హేలీ, సీమా వర్మ, ప్రీత్ భరారా, ఆ తరువాత ట్రంప్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో నియమించిన నాలుగో వ్యక్తి అజిత్ కావడం విశేషం. అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తులు నలుగురు ఉండడం మన దేశానికే గర్వకారణం.