ఉత్తర కొరియాని దెబ్బ కొట్టిన ట్రంప్.. కోలుకోవడం కష్టమే!

Saturday, February 24th, 2018, 05:27:09 PM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోపం వచ్చినా కష్టమే నవ్వు వచ్చినా కష్టమే. అయితే గత కొంత కాలంగా ఉత్తర కొరియా తీరుపై ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్న విషయం గురించి తెలిసిందే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రవర్తన కు విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు రోజు రోజుకి సహనాన్ని కోల్పోతున్నాడు. ఆ దేశం అణు పరీక్షలను చేస్తూ అమెరికాపై పగా తీర్చుకుంటామని పదే పదే చెప్పడంతో కొరియా మా బలాన్ని తక్కువ అంచనా వేయొద్దని ఒక వేల యుద్ధం వస్తే కొరియా నామ రూపం లేకుండా పోతుందని ట్రంప్ కొన్ని నెలల క్రితం పళ్ళు కొరుకుతూ.. వార్నింగ్ ఇచ్చాడు.

అయితే రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మళ్లీ మరో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఉత్తర కొరియా తన పద్దతిని మార్చుకోకపోవడంతో ఆ దేశం ఆర్థిక వ్యవస్థపై దెబ్బ పడేలా ట్రంప్ గట్టి ప్లాన్ వేశాడు. ఏ దేశం అయినా ఉత్తర కొరియా తో వ్యాపార దిగుమతులను ఎగుమతులను చేయకూడదు. చేస్తే ఆ దేశం అమెరికాతో సంబంధాలు తెంపుకున్నట్లే అనే విధంగా ట్రంప్ ఇటివల మీడియా సమావేశంలో తెలిపాడు. ఇంతవరకు ఏ దేశంపై తీసుకొని కఠినమైన ఆంక్షలను ఉత్తర కొరియాపై అమలు చేస్తున్నాం.

సముద్ర మార్గంలో ఆయుధాలను సరఫరా చేసే నౌకలు అలాగే అక్రమంగా బొగ్గు, ఇంధన రవాణా చేస్తున్న ఆ దేశం నౌకలను స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ తెలిపారు. అయితే ఈ విధానం వలన ఉత్తర కొరియా వాణిజ్య రంగాలు చాలా దెబ్బ తింటాయి. ఇప్పటికే ఐక్య రాజ్య సమితి ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది. అయితే ఇప్పుడు ట్రంప్ కూడా తన బలంతో ఇతర దేశాలు ఆ దేశానికి సహఃయ పడకుండా అడ్డుకుంటుండంతో ఉత్తర కొరియా పరిస్థితి ఏమిటా అని ప్రపంచం వ్యాప్తంగా వార్తలు వెలువడుతున్నాయి.