సమగ్ర సర్వేలో తేలిన నిజాలు

Thursday, September 11th, 2014, 08:40:52 AM IST


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి. అయితే విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తం మీద వంద శాతం ఆధార కార్డులు కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉండగా విభజన తర్వాత తెలంగాణలో దాదాపు 70లక్షల మందికి ఆదార్ కార్డులు లేనట్టుగాసర్వేలో తేలింది. దీనితో తమ పధకాలన్నింటికీ ఆదార్ కార్డుతో సంధానం చెయ్యాలని చూస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు అయినట్లు అయ్యింది.

ఇక 2011తో పోలిస్తే ప్రజలలో టూ వీలర్లు, కార్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అధికంగా వాడుతున్నట్లుగా సర్వేలో తెలిసింది. అలాగే ఆగస్టు 19న జరిగిన సమగ్ర సర్వేలో ఎన్యూమరేటర్లు 1.05కోట్ల ఇళ్ళను సర్వే చేశారు. కాగా వీటిలో 3.11కోట్ల మంది ప్రజలతో కూడిన 92.07లక్షల ఇళ్ళ సర్వే వివరాలు కంప్యూటరీకరణ కాబడ్డాయి. అయితే ఈ 3.11కోట్ల మందిలో 2.43కోట్ల మంది ప్రజలకు మాత్రమే ఆదార్ కార్డులు ఉన్నట్లుగా తెలిసింది. అలాగే తెలంగాణలో ప్రస్తుతానికి 70లక్షల మందికి ఆధార్ కార్డు లేనట్లు తెలియగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో వెంటనే ఆదార్ కార్డుల నమోదుకు చర్యలు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.