ఈ యాప్ తో మీరు ఎక్కడున్నా పోలీసులు పట్టేస్తారు

Tuesday, May 15th, 2018, 04:00:11 PM IST

తెలంగాణా ప్రభుత్వం రోజు రోజుకూ కొత్త టెక్నాలజీని కనిపెట్టి దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా చేయడంలో ముందంజలో ఉన్నది. ఐటీ శాఖ అయితే ఇంకా శరవేగంగా దూసుకుపోతున్నది. అయితే ఇటివల నేరస్తులను, మానిషి కనిపించకుండా పోయిన కేసులను, గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవడానికి పోలీస్ రంగానికి ప్రభుత్వం మరో కొత్త టెక్నాలజీని అందజేసింది. ఇలాంటి జాబితాలో ఉన్న కేసులను పట్టుకోవడానికి టీఎస్ కాప్స్ అను ఒక వైవిధ్యమైన మొబైల్ యాప్ ను అందించింది. ఈ యాప్ లో ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్టువేర్ ను అనుసంధానం చేయడం వల్ల నేరస్తులను చాలా సులభంగా పట్టుకోవడానికి అవకాశం లభించింది. అయితే ఈ టెక్నాలజీని వీలైనంత త్వగలో వాడుకలోకి తీసుకురావడానికి ఆండ్రాయిడ్ విభాగం సర్వత్రా సిద్దం చేస్తున్నది.

ఇదివరకు ఒక చోట కనపడకుండా పోయిన మనిషి దొరికితే వారి వివరాలు కనిపెట్టడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. వారికి సంబందించిన సమాచారం పోలీసుల దగ్గర ఉండకపోవడం, ఇకే టౌనులోని రెండు లేక మూడు జోన్లలో ఉన్న పోలీసు విభాగాల మధ్య సరైన కమ్యునికేషన్ లేకుండటం, వంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు టీఎస్ కాప్స్ పోలీసులకు దగ్గరైన తర్వాత ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. సమయం వృధా కాకుండా ప్రతీ పని చాలా వేగవంతంగా చేయవచ్చు. ఈ సాఫ్టువేరు ద్వారా నేరస్తులను పట్టుకునేందుకు సులువు చేశారు, చివరికి చనిపోయిన మనిషి సమాచారం కూడా చాల సులువుగా తెలుసుకునే కొత్త టెక్నాలజీతో ఈ సాఫ్ట్ వేర్ తయారు చేసారు. ప్రస్తుతం ఇది సరిగ్గా పనిచేస్తున్నదా లేదా అన్న విషయంపై ప్రయోగం జరుగుతున్నది.