ఫుల్లుగా తాగి వీరంగం సృష్టించిన టిటిడి ఉద్యోగి!

Monday, April 23rd, 2018, 11:02:47 PM IST


ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయిఉండి, అందునా పరమ పవిత్రమని తిరుపతి లోని గోవిందరాజుల స్వామి సన్నిధిలో వాహన బేరర్ గా పనిచేస్తున్న కుమార్ అనే వ్యక్తి రోజు లానే నిన్న ఆలయానికి వచ్చాడు. అయితే వచ్చిన తరువాత ఫుల్లుగా పీకలదాకా మద్యం సేవించిన అతడు కాసేపటికి తన వొంటి మీద వున్నా బట్టలను తీయపారేసి కేవలం ఒక డ్రాయర్ మాత్రమే ఉంచుకుని ఆ రోడ్ చుట్టుప్రక్కల వున్న దుకాణాలు, ప్రజలపై వీరలెవల్లో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా అతని వింత చర్యలకు భయపడ్డ ఆ ప్రాంత వాసులు అతనిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ అతడు ప్రతిఘటించాడు. అయితే అటుగా వెళ్తున్న ఒక కానిస్టేబుల్ కుమార్ను ఆప్ ప్రయత్నం చేయగా అతన్ని కూడా కుమార్ గాయపరిచాడు. అలానే చాలాసేపు చేతికందిన వస్తువులు, పార్క్ చేసివున్న వాహనాల పై తన ప్రతాపాన్ని చూప సాగాడు.

అలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న అతనిపై స్థానికులు పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. ఒక అరగంట తర్వాత అక్కడికి చేసుకున్న పోలీస్ లు అతి కష్టం మీద అతన్ని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. ఈ మొత్తమ్ ఉదంతం టిటిడి బోర్డు కు చేరడంతో బోర్డు కుమార్ పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కుమార్ వీరంగం సృష్టించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అది చూసిన వారంతా అతడి వికృత చేష్టలకు ముక్కున వేలు వేసుకుంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments