మాకు సీట్లు రాకపోయినా పర్లేదు కానీ కెసిఆర్ మాత్రం గెలవకూడదు..టీటీడీపీ

Wednesday, October 10th, 2018, 12:20:37 PM IST

తెలంగాణా రాష్ట్రంలోని ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది.ఇప్పుడు టీటీడీపీ,టీకాంగ్రెస్ మరియు బీజేపీ లు ప్రధాన లక్ష్యం కేవలం తెరాస పార్టీ మాత్రమే.ఎలా అయినా సరే ఈ సారి మాత్రం కెసిఆర్ ను గెలవనివ్వకూడదని ఈ మూడు పార్టీల వారు బలంగా కంకణం కట్టుకున్నారు.ఇప్పటికే మహాకూటమి పేరిట కాంగ్రెస్ మరియు టీడీపీలు వచ్చే డిసెంబరులో ఎన్నికల బరిలోకి దిగనున్నాయి.దీనితో ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస పార్టీని ఓడించి వీరి జెండాలు ఎగురవేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐతే తెలంగాణా రాష్ట్రంలో టీడీపీ కన్నా కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉందని చెప్పాలి.అక్కడక్కడా కొన్ని చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ బలం కలిగి ఉంది.దీనితో టీకాంగ్రెస్ పార్టీ వారు దాదాపు 100 సీట్లలో పోటీ చెయ్యాలని చూస్తున్నారు అప్పటికే 30 సీట్లను ఆశించిన టీడీపీకి అంత స్థాయిలో కేటాయింపు జరగకపోవడంతో కాస్త అసహనంగానే ఉన్నారని చెప్పాలి.అయినా సరే వారు మాత్రం సీట్ల కేటాయిపుల్లో ఒకవేళ నెగ్గినా ఎవరికీ ఏ అధికారం ఇవ్వాలి అన్న వాటి కన్నా కేవలం తెరాస అతని కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నారు అని తెలుస్తుంది.ఇప్పుడు మాత్రం గెలుపోటములు,సీట్ల కేటాయింపులు మీద వారిలో వారికే గొడవలు ఐతే కెసిఆర్ కు మరింత బలం చేకూరుతుందేమో అనుకుంటున్నారేమో..ముందు మాత్రం కెసిఆర్ ని ఈ సారి మళ్ళీ సీఎం కుర్చీలో మాత్రం కూర్చొనివ్వకూడదు అని బలంగా నిశ్చయించుకున్నారు.