టెలివిజ‌న్‌ ప‌నైపోయింది గోవిందా గోవింద‌!

Friday, July 13th, 2018, 09:19:37 PM IST

ఇన్నాళ్లు ఇంటికి రాగానే టీవీ పెట్టుకుని కాసేపు రిలాక్స్‌డ్‌గా కాల‌క్షేపం చేద్దామ‌ని అనుకునేవారు. కానీ మునుముందు ఈ స‌న్నివేశంలో మార్పు రానుందా? అంటే అవుననే ప్రూఫ్ చెబుతోంది. మునుముందు బుల్లితెర క్రేజు పూర్తిగా అడుగంటిపోయే ప్ర‌మాదం ఉంద‌ని, ఆ మేర‌కు డిజిట‌ల్ వేదిక టెలివిజ‌న్ ప‌రిశ్ర‌మ‌కు ముప్పుగా ప‌రిణ‌మించింద‌ని ఈ కొల‌మానం చెబుతోంది. అందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యమిదే. ప్ర‌తిష్ఠాత్మ‌క అమెరిక‌న్ టెలివిజ‌న్ అందించే ఎమ్మీ అవార్డ్స్ టెలివిజ‌న్ రంగంలో కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన‌ది.

ప్ర‌తిసారీ ఈ పుర‌స్కారాల్ని హెచ్‌బీవో చానెల్ ఎగ‌రేసుకుపోయేది. మెజారిటీ పార్ట్ అవార్డుల్ని కైవ‌శం చేసుకునేది. కానీ ఈసారి ఆ స్థానంలోకి డిజిట‌ల్ మాధ్య‌మం నెట్‌ఫ్లిక్స్ దూసుకొచ్చింది. 18 ఏళ్ల ఎమ్మీ పుర‌స్కారాల చ‌రిత్ర‌లో నెట్‌ఫ్లిక్స్ అగ్ర తాంబూలం అందుకోవ‌డం చూస్తుంటే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ బిజినెస్ ఏ రేంజులో సాగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. టెలివిజ‌న్‌ని డిజిట‌ల్ మాధ్య‌మం డామినేట్ చేస్తోంది అనేందుకు ఈ ఒక్క సాక్ష్యం చాలు. యూట్యూబ్‌, వెబ్ సిరీస్‌ల రూపంలో మునుముందు ఇంకా ఇంకా టీవీకి ప్ర‌మాదం పొంచి ఉంది. టీఆర్‌పీ ఆట‌లో అల‌సిసొల‌సి పోయిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెళ్ల‌కు ఈ ముప్పు ప్ర‌మాద‌క‌రంగానే మారేట్టు క‌నిపిస్తోంది. ఎమ్మీ 2018 అవార్డుల్లో అన్ని చానెళ్ల‌ నుంచి 108 నామినేష‌న్లు ఉంటే, ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ నుంచి 112 నామినేష‌న్లు వెళ్లాయంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇక‌పోతే తెలుగు టీవీ చానెళ్ల వ‌ర‌కూ ప‌రిశీలిస్తే ఊద‌ర‌గొట్టుడు పాశ్చాత్యుల `బిగ్‌బాస్` రియాలిటీ షోలు, క్వీజ్ కార్య‌క్ర‌మాల‌తో .. లేదూ సుత్తి చెత్త కార్య‌క్ర‌మాల‌తో ఇప్ప‌టికే జ‌నాల టైమ్ తినేస్తున్నాయ‌న్న బ్యాడ్ టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో బుల్లిపెట్టెలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ల‌తో థ్రిల్ల‌య్యేందుకు యూత్ మొగ్గు చూపుతోంద‌ని స‌ర్వే నిగ్గు తేలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments