హైదరాబాద్ లో కవలల దారుణ హత్య.. సొంత మేనమామే..

Saturday, June 16th, 2018, 09:33:53 AM IST

ప్రస్తుతం మనిషి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఈ లోకంలో మానవత్వానికి చోటు లేదు అనే భావన కలుగుతోంది. నవ్వుతు బ్రతికే జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలను తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన హత్యలు అందరిని షాక్ కి గురి చేశాయి. సొంత బంధువే మానసిక వికలాంగులైన కవల పిల్లలను చంపేసిన వైనం సంచలనంగా మారింది.

అసలు వివరాల్లోకి వెళితే.. చైతన్య పూరికి చెందిన ఓ వ్యక్తి రెండు శవాలను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై అరా తీయగ.. మిర్యాలగూడకు చెందిన లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు 12 ఏళ్ల వయసున్న సృజనరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి అనే కవలలున్నారు. వారికి మానసిక స్థితి అంతగా బావుండదు. అయితే ఇటీవల కవలల మేన మామ ఇద్దరిని హైదరాబాద్ కు తీసుకు వచ్చాడు.

వారిని వదిలించుకోవాలని మేన మామ ఇద్దరిని హత్య చేశాడు. రెండు మృతదేహాలను కారులో తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా ఇంటి యజమాని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఇంకా హత్యకు గల అసలు కారణాలు ఏమైనా ఉంటాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.