కాంగ్రెస్‌కు ట్విట్ట‌ర్ సీఈవో మ‌ద్ద‌తు

Tuesday, November 13th, 2018, 10:07:38 AM IST

ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేళ గ‌ణ‌ణీయంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండ‌టంతో ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలని స‌హాయం కోరుతున్నాడు. ఎన్నిక‌ల వేళ సోష‌ల్ మీడియాలో న‌కిలీ స‌ర్వేలు, న‌కీలీ వార్త‌లు వైర‌ల్‌గా మారే ప్ర‌మాదం వుంది. దీన్ని దృష్టిలోపెట్టుకుని రాహుల్ ప్ర‌సార మాధ్య‌మాల‌కు సంబంధించిన కీల‌క నేత‌ల్ని క‌లిసి స‌హ‌క‌రించాల్సిందిగా కోరుతుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ట్విట్ట‌ర్ సీఈవోను సోమ‌వారం రాహుల్ గాంధీ ప్ర‌త్యేకంగా క‌లిసి న‌కిలీ వార్త‌ల్ని క‌ట్ట‌డి చేయాల‌ని కోరిన‌ట్లు చెబుతున్నారు.

ఎన్నిక‌ల‌ని ప్ర‌భావితం చేసే న‌కిలీ వార్త‌ల వ్యాప్తి బహుళ ర‌కాల స‌మ‌స్య‌గా మారింద‌ని, దీన్ని ఒక్క‌సారిగా ప‌రిష్క‌రించ‌లేమ‌ని, అయితే వీటికి త‌ప్ప‌కుండా అడ్డుక‌ట్ట వేస్తామ‌ని ట్విట్ట‌ర్ సీఈవో జాక్ డోర్సే సోమ‌వారం స్ప‌ష్టం చేశారు. తొలిసారిగా భార‌త పర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న ఢిల్లీ ఐఐటీలో నిర్వ‌హించిన టౌన్‌హాల్ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు. ఏదైనా స‌మాచారం త‌ప్పుదోవ ప‌ట్టించేదిగా వుందంటే దాన్ని నివారించ‌డ‌మే మా కంపెనీ విధి. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి కృత్రిమ మేధ కొంత వ‌ర‌కు స‌హ‌క‌రించ‌గ‌ల‌ద‌ని స్ప‌ష్టం చేశారు. అంత‌కు ముందు ఉద‌య‌మే పీసీసీ నేత రాహుల్ గాంధీతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై ప‌లు అంశాల్ని చర్చించి కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌తామ‌నే సంకేతాలివ్వ‌డం బీజేపీకి అంతుచిక్క‌డం లేద‌ట‌.